Missing Parrot: పెంపుడు జంతువులు, పక్షులను కొంతమంది తమ కుటుంబంలో ఓ సభ్యులా భావించి వాటిని తమ పిల్లలతో సమానంగా భావించి ప్రేమగా చూసుకుంటారు. తమ పెంపుడు జంవుతువులకు, పక్షులకు పుట్టినరోజు వేడుకలు వంటివి చేసి.. తమ సంతోషన్ని అందరితోనూ పంచుకుంటున్నారు. కూడా అయితే తాజాగా ఓ వ్యక్తి , ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక తప్పి పోయింది. దీంతో ఆ పక్షి యజమాని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన పెంపుడు పక్షి కోసం వెదకడం మొదలు పెట్టాడు. అంతేకాదు.. ఏకంగా పక్షికోసం పాంప్లెట్స్ పంచిపెడుతూ.. తన రామచిలుకని తెచ్చి ఇచ్చినవారికి ఏకంగా భారీ నజరానా కూడా ప్రకటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని రాంఝీ మనేగావ్‌కు చెందిన అమన్‌సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తప్పిపోయిన తన రామ చిలుకను తిరిగి తీసుకొచ్చే వారికి రూ.15,000 బహుమతిని అందజేస్తానని ప్రకటించాడు. అంతేకాదు తన చిలుక పేరు బిట్టు అని దాని వివరాలతో కూడిన కరపత్రాలను ముద్రించి.. చిలుకను వెదకడానికి ప్రజల సహాయం కోరుతున్నాడు. ఇప్పటికే ఆ పాంప్లెట్స్ ను నగరంలో పంపిణీ చేశాడు. అమన్ దగ్గర ఆ రామ చిలుక దాదాపు రెండేళ్లు ఉంది. దానికి బిట్టు అనేపేరు పెట్టుకుని చిన్న పిల్లతో సమానంగా పెంచుకుంటున్నాడు. అయితే నవంబర్ 2వ తేదీన, చిలుక పంజరం తలుపు తెరుచుకుని బయటకు వచ్చి బాల్కనీలో ఎగరడం ప్రారంభించింది.
అయితే కొంత సమయం తరువాత, అది అకస్మాత్తుగా అదృశ్యమైంది. అమన్ తన చిలుక కోసం ఇంట్లో.. చుట్టుపక్కల వెతికాడు.. కానీ రామచిలుక కనిపించకపోవడంతో వెంటనే చిలుక తన చిలుక బిట్టు అదృశ్యమైనట్లు ఓ వార్తా పత్రికలో ప్రకటన ఇచ్చాడు. అయినప్పటికీ చిలుక గురించి ఏ వివరాలు తెలియకపోవడంతో.. తన బిట్టుని తిరిగి తనకు తెచ్చి ఇచ్చిన వారికి రూ.15 వేలు రివార్డు ఇస్తానని ప్రకటించాడు. అందుకు సంబంధించిన కరపత్రాలను ముద్రించి నగరం అంతా పంచిపెట్టాడు.
బిట్టు కనిపించకుండా పోయినప్పటి నుండి అమన్ చాలా ఆందోళన చెందాడు. బిట్టు కోసం వెతుకుతున్నాడు. ఈ పాంప్లెట్స్ చూసిన కొందరు అమన్‌ను సంప్రదించారు. అయితే వారు చూపించిన చిలుక తనది కాదని.. ఎలాగైనా తన బిట్టు తనదగ్గరకి తిరిగి చేరుతుందని అమన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: ప్రపంచంలోనే ఖరీదైన మేకపోతు.. దీని ధర తెలిస్తే షాక్.. ఎక్కడంటే..