చలికాలంలో గడ్డ కట్టుకుపోయే గ్రామం.. మన దేశంలోనే ఉందండోయ్!
చలికాలంలో చాలా రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అయితే మన దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు ఏకంగా -40° పడిపోతుందట. దీంతో ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో ఎత్తైన ప్రదేశంలో..

మన దేశంలో ఉత్తరాది, దక్షిణాది ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో కాస్త ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇక చలికాలంలో ఉదయం, రాత్రి వేళల్లో గడగడలాడించినా పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా చలికాలంలో చాలా రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అయితే మన దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు ఏకంగా -40° పడిపోతుందట. దీంతో ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో ఎత్తైన ప్రదేశంలో ఉందీ ప్రాంతం. అదే.. హిమాలయాల్లో ఎత్తైన పర్వతాలు, దట్టమైన మంచు మధ్య దాగి ఉన్న ద్రాస్ అనే ఊరు. ఈ ఊరికి ప్రపంచంలోనే అత్యంత శీతల నివాస స్థలంగా పేరు. శ్రీనగర్, కార్గిల్ మధ్య డ్రైవింగ్ చేసే చాలా మంది ప్రయాణికులకు ద్రాస్ సైన్ బోర్డు తప్పక కనిపిస్తుంది. అయితే ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మరింత మైమరిపిస్తాయి. అయితే ఇక్కడి శీతల పరిస్థితులను లెక్క చేయని ధైర్యవంతులైన ప్రయాణికులు కొందరు ప్రకృతి అందాలను ఆశ్వాదించడానికి వస్తుంటారు.
ద్రాస్ పర్యాటకం
శీతాకాలంలో ద్రాస్ ఉష్ణోగ్రతలు దాదాపు -40°C కంటే చాలా తక్కువగా పడిపోతాయి. చలి కాలంలో ఈ గ్రామం చూసేందుకు గడ్డ కట్టిన ఐస్‌లా కనిపిస్తుంది. జోజి లా పర్వత మార్గం పాదాల వద్ద ఉన్న ద్రాస్ మార్గంలో.. శీతాకాలంలో ప్రయాణించడం కొంచెం కష్టమే. కానీ వేసవిలో అమర్‌నాథ్ గుహ, సురు లోయకు ట్రెక్కింగ్ చేసేందుకు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ గ్రామం కార్గిల్ యుద్ధం నాటి ప్రధాన ప్రదేశాలైన టైగర్ హిల్, టోలోలింగ్ వ్యూ పాయింట్‌లకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు మన్మాన్ టాప్‌ను కూడా సందర్శించవచ్చు. అక్కడ నుంచి LOCని చూడవచ్చు. కార్గిల్ యుద్ధం గురించి ప్రదర్శించే బ్రిగేడ్ వార్ గ్యాలరీని కూడా సందర్శించవచ్చు. ఈ గ్రామంలో 1999లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, అధికారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్ కూడా ఉంది.
ద్రాస్ పర్యాటకానికి ఎప్పుడు వెళ్లాలి?
ప్రయాణికులు తరచుగా ద్రాస్‌లో బస కష్టమని చెబుతుంటారు. కానీ వేడి వేడి టీ అందించే చిన్న హోమ్‌స్టేలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి జమ్ముకశ్మీర్ సందర్శన సులువు. ద్రాస్ సందర్శనకు మంచి సమయం జూన్ – సెప్టెంబర్ మధ్య. ఆ సమయంలో రోడ్లు తెరిచి ఉంటాయి. లోయ పూల మొక్కలతో పచ్చగా ఉంటుంది. శీతాకాలంలో కూడా వెళ్లవచ్చు. కానీ చలిని తట్టుకోగలిగే అనుభవజ్ఞులైన సాహసికులు మాత్రమే ఇక్కడి చేరుకోగలరు.
ద్రాస్‌కు ఎలా చేరుకోవాలంటే?
ద్రాస్‌కు దగ్గరగా ఉన్న లేహ్ విమానాశ్రయం, శ్రీనగర్ లో జమ్మూ తావి అనే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాయి. అలాగే శ్రీనగర్, కార్గిల్ మధ్య అనేక బస్సులు కూడా ద్రాస్ సెక్టార్ నుంచే వెళతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




