Government Employees: ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సదుపాయలన్ని తొలగింపు..!

Central Government Employees: గత ఏడాదికిపై కరోనా మహహ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి కేంద్రం చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం వైరస్‌..

Government Employees: ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సదుపాయలన్ని తొలగింపు..!
Employees

Edited By: Phani CH

Updated on: Nov 08, 2021 | 5:44 PM

Central Government Employees: గత ఏడాదికిపై కరోనా మహహ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి కేంద్రం చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు ఉండగా, ప్రస్తుతం ఆన్‌లాక్ దశలో ఉంది. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ కూడా తెరుచుకున్నాయి. ఎవరికి వారు యధావిధిగా వ్యాపారాలు చేసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 8వ తేదీ నుంచి (ఈ రోజు) నుంచి కోవిడ్‌ కారణంగా ఉద్యోగులకు అందించిన సౌకర్యాలను సౌతం తొలగిస్తున్నట్లు తెలిపింది.

కోవిడ్‌ సమయంలో కార్యాలయాలకు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు హాజరైనట్లు తెలిపిన కేంద్రం.. తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పాటు పనిగంటలను కూడా తగ్గించినట్లు తెలిపింది. ఈ రోజు నుంచి కరోనా సమయంలో అందించిన సౌకర్యాలన్నీ కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్‌ కుమార్‌ తెలిపారు. అందుకు ఉద్యోగుల కోసం పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.

ప్రతి ఉద్యోగులు కార్యాలయానికి రాగానే శానిటైజర్‌ చేసుకోవడం తప్పనిసరి. ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు నమోదు సమయంలో సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే ఉద్యోగులు విధుల్లో ఉన్నంత సేపు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. బయోమెట్రిక్‌ యంత్రాలను బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. బయోమెట్రిక్‌ టచ్‌ప్యాడ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా సిబ్బందిని నియమించుకోవాలి. ఒక వేళ బయోమెట్రిక్‌ యంత్రం కార్యాలయం లోపల ఉన్నట్లయితే తగినంత వెంటిలేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. విధుల నిమిత్తం ఉద్యోగులు ఆఫీస్‌కు రాగానే, మళ్లీ విధులు ముగించుకుని వెళ్లేటప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి. ప్రతి ఉద్యోగి కూడా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ.1.03 కోట్ల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు ఐదేళ్లు.. పెరిగిన కరెన్సీ నోట్ల వినియోగం.. డిజిటల్‌ చెల్లింపుల జోరు