కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య,మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్. ఆమె టీవీ9 ప్రతినిధితో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మంత్రి నిర్మలా.. మహిళలకు ఎంతో మంచి పేరు తెచ్చారన్నారు. చిన్న తరహా వ్యాపారస్తులకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందన్నారు. గృహనిర్మాణానికి బడ్జెట్‌లో ఇచ్చిన వెసులుబాటు ఎంతో బాగుందన్నారు. దేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.