హోం మంత్రి అమిత్ షా చేతిలో ఉన్నది ఏమిటీ?

| Edited By:

Aug 05, 2019 | 10:12 PM

ఆర్టికల్ 370 రద్దు గురించి సభలో ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు అమిత్ షా చేతిలో కొన్ని పత్రాలు పట్టుకుని ఉన్న ఫోటో తెగ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి జరిగిన చర్చ గురించి తెలిసిందే. అదే సమయంలో ఈ ఫోటో గురించి కూడా చర్చ జరిగింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో అనే విషయంపైనే చర్చ సాగింది. ఆ ఫోటోలో ఏం ఉందంటే.. ఆర్టికల్‌ 370 రద్దుకు సబంధించి రాజ్యాంగ పరంగా, […]

హోం మంత్రి అమిత్ షా చేతిలో ఉన్నది ఏమిటీ?
Follow us on

ఆర్టికల్ 370 రద్దు గురించి సభలో ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు అమిత్ షా చేతిలో కొన్ని పత్రాలు పట్టుకుని ఉన్న ఫోటో తెగ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి జరిగిన చర్చ గురించి తెలిసిందే. అదే సమయంలో ఈ ఫోటో గురించి కూడా చర్చ జరిగింది.

ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో అనే విషయంపైనే చర్చ సాగింది. ఆ ఫోటోలో ఏం ఉందంటే.. ఆర్టికల్‌ 370 రద్దుకు సబంధించి రాజ్యాంగ పరంగా, రాజకీయంగా, న్యాయపరంగా ఏఏ సెక్షన్లను చేర్చాలి, వాటి వల్ల వచ్చే చిక్కులు.. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇలా పూర్తి సమాచారాన్ని ఈ పత్రాల్లో ఉంది. దీంతో పాటు రాష్ట్రపతికి ఈ సమాచారాన్ని చేరవేయడం, రాజ్యసభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జమ్మూకశ్మీర్‌కి హోం శాఖ కార్యదర్శిని పంపించడం లాంటి అంశాలు కూడా స్పష్టంగా కనిపించేలా మార్క్ చేశారు.

ఎక్కడా ఎలాంటి పొరబాటు దొర్లకుండా ఉండేందుకు ప్రతీది పక్కాగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అమిత్ షా. సభలో ఎలాంటి తొందరపాటుకు గురికాకుండా ఉండేలా ఇలా వివరణాత్మకంగా పేపర్లను రెడీ చేసుకున్నారు.