ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన బాలుడు.. పక్కనున్న నీటి తొట్టిలో చూడగా…
తమిళనాడులోని తిరువన్నమలైలో విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మరణించడం స్థానికంగా విషాద తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడిని గమనించిన స్థానికులు బాబును తొట్టిలోంచి బయటకు తీసి హాస్పిటల్‌లకు తరలించినప్పటికి ఎలాంటి లాభం లేకపోయింది.

జూలై 17: ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల బాలుడు ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. గమనించిన ఎదురింటి వారు బాలుడిని నీటి తొట్టి నుండి రక్షించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. తిరువన్నమలై జిల్లాలోని కలసపాక్కం సమీపంలోని కట్టుపుత్తూర్ గ్రామానికి చెందిన పళని, భార్గవి అనే ఇద్దరు దంపతులు దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరు పెద్ద కుమూర్తె ప్రవీణ స్థానికంగా ఉన్న స్కూల్‌లో ఒకట తరగతి చదువుతుంది.. ఈమెతో పాటు ఈ దంపతులకు ముగినల్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో అక్క ప్రవీణ స్కూల్‌కు వెళ్లిపోయింది. ఇక పరళి చిన్న కుమారు ముగిలన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లాడు ఇక్కడే ఆడుకుంటున్నాడు కదా అని తల్లి కూడా పెద్దగా అతనిపై ద్యాస పెట్టలేదు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు బాలుడు అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి
అయితే ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు కనిపించక పోయేసరికి తల్లి కంగారు పడి ఇంటి చుట్టుపక్కల వెతికింది. పక్కింటి వారికి కూడా బాలుడు కనిపించట్లేదని చెప్పింది. ఈ క్రమంలో వాళ్లు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఇంతలో నీటి తొట్టిలో ఊపిరి ఆడకుండా, మాట్లాడకుండా అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని చూసిన బార్గవి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బాలుడిని నీటి తొట్టిలోంచి బటయకు తీసి పక్కింటి వారం సహాయంతో చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించాడని నిర్థారించారు.
తీవ్ర విషాదాన్ని కలిగించిన సంఘటన
వైద్యులు చెప్పిన మాట వినగానే భార్గవి గుండె పగిలిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ తల్లి ఏడుపు చూసిన స్థానిక జనంతో పాటు డాక్టర్లుకు సైతం గుండెతరుక్కుపోయింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చరీకి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




