AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Line: మెట్రో లైన్‌ వైర్లను కట్‌ చేసి దొంగతనానికి యత్నం.. నిలిచిపోయిన మెట్రో సిగ్నల్‌ వ్యవస్థ.. దొంగల కోసం గాలింపు..!

Metro Line: సాధారణంగా ఇళ్లల్లో, షాపుల్లో, బ్యాంకులు, ఏటీఎంలలో దొంగలు పడటం అనేది చూశాం. కానీ మెట్రో రైలు వైర్లను దొంగిలించే వాళ్లను చూసి ఉండము. దొంగలు వివిధ..

Metro Line: మెట్రో లైన్‌ వైర్లను కట్‌ చేసి దొంగతనానికి యత్నం.. నిలిచిపోయిన మెట్రో సిగ్నల్‌ వ్యవస్థ.. దొంగల కోసం గాలింపు..!
Subhash Goud
|

Updated on: Dec 14, 2021 | 11:55 AM

Share

Metro Line: సాధారణంగా ఇళ్లల్లో, షాపుల్లో, బ్యాంకులు, ఏటీఎంలలో దొంగలు పడటం అనేది చూశాం. కానీ మెట్రో రైలు వైర్లను దొంగిలించే వాళ్లను చూసి ఉండము. దొంగలు వివిధ రకాల చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నోయిడాలో దొంగలు మెట్రో వైర్లను కట్‌ చేసి మెట్రో లైన్‌ సిగ్నల్స్‌ నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన గౌతమ్‌ బుద్‌ నగర్‌ జిల్లా యంత్రాంగం నోయిడా పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి దొంగలు నోయిడా మెట్రో లైన్‌ కేబుల్‌ కట్‌ చేసేందుకు యత్నించారు. దీంతో కేబుల్‌ తెగిపోవడంతో మెట్రో లైన్‌ సిగ్నల్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. దీంతో గమనించిన రైల్వే అధికారులు వెంటనే డీఎంఆర్‌సీ యాజమాన్యానికి సమాచారం అందించగా, దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసులు సీసీ పుటేజీని పరిశశీలిస్తున్నారు. పుటేజీ ఆధారంగా పోలీసులు, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. నోయిడా ఎలక్ట్రానిక్ మెట్రో సిటీ స్టేషన్ మరియు నోయిడా సెక్టార్-62 మెట్రో స్టేషన్ మధ్య ఉన్న కేబుల్ లైన్లను దొంగలు కట్ చేశారు. దీంతో సిగ్నల్ వ్యవస్థకు అంతరాయం కావడంతో రెండు మెట్రో స్టేషన్ల మధ్య సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (NMRC) ఈ విషయమై నోడియా పోలీస్ స్టేషన్ ఫేజ్-3లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న నోయిడా పోలీసులు ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెట్రో స్టేషన్లలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సిగ్నల్‌ కోతతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో రైళ్ల వేగంపైనా ప్రభావం పడింది. సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడిచాయి.

ఇవి కూడా చదవండి:

Omicron Variant: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌.. ఇప్పటి వరకే ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు ఆదాయం..!

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!