Uber: ఊబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులపై నిషేధం.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ అమలు.. చట్టవిరుద్ధమని ఘాటు వ్యాఖ్యలు..

పెరుగుతున్న సాంకేతికత ఆధారంగా ఎన్నో రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి...

Uber: ఊబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులపై నిషేధం.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ అమలు.. చట్టవిరుద్ధమని ఘాటు వ్యాఖ్యలు..
Ola, Uber, Rapido Ban In Karnataka

Updated on: Oct 13, 2022 | 7:38 AM

పెరుగుతున్న సాంకేతికత ఆధారంగా ఎన్నో రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చినవే ఊబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు. అప్పట్లో ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు బస్సులు, ఆటోలను ఉపయోగిస్తుంటారు. కానీ ఇప్పుడు బైక్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడున్నా సరే.. ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కోరుకున్న ప్రదేశానికి క్షణాల్లో వెళ్లిపోవచ్చు. అయితే.. విస్తృతంగా సేవలందిస్తున్న ఓలా, ఉబర్​, ర్యాపిడో సంస్థలపై కర్ణాటక ప్రభుత్వ నిషేధం విధించింది. ఈ సంస్థలు అందిస్తున్న ఆటో రిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం సంబంధిత యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఆన్​లైన్ బుకింగ్స్​ను సైతం నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. రోడ్డు రవాణ సంస్థతో పాటు రోడ్డు భద్రత విభాగంతో మంగళవారం జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు వీటి ద్వారా ప్రజలకు ఎటువంటి సేవలు అందించే అవకాశం లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కర్ణాటక ఆన్-డిమాండ్ రవాణా టెక్నాలజీ ఆగ్రిగేటర్స్ రూల్(కొట్టార్-2016) చట్టం ప్రకారం.. క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులు అందించేందుకు అవకాశం లేదని రవాణా కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని వెల్లడించారు. అంతే గానీ సాధారణంగా నడిచే ఆటో రిక్షావాలాలపై ఎలాంటి చర్యలు తీసుకోమని, క్యాబ్ సంస్థలకే ఈ నిబంధన వర్తిస్తుందని ఆదేశాల్లో వివరించారు.

ఇవి కూడా చదవండి

ఆటో రిక్షా సేవలను మళ్లీ ప్రారంభించేందుకు టాక్సీ అగ్రిగేటర్లు మరలా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలపై నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 6న కర్ణాటక రవాణా శాఖ వాటికి నోటీసులూ జారీ చేసింది. క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సేవలు అందించడం చట్టవిరుద్ధం అని పేర్కొంది. ఆటోరిక్షా సర్వీసులను ఆపేయాలని ఆదేశిస్తూ ఆదేశాలను జారీ చేసింది.