ట్విట్టర్‌కు ఆల్టర్నేటివ్.. ఫుల్లీ లోకల్ మేడ్.. మేడిన్ ఇండియా యాప్. కూ. సోషల్ మీడియాకు కొత్త యాప్. కూ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ నేతలు చాలా మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నతోద్యోగుల ఫోన్లలో కూ డౌన్‌లోడ్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎందుకు?. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆత్మ నిర్భర్ భారత్.. కేంద్ర ప్రభుత్వ తారక మంత్రం. వీలున్న చోటల్లా స్వదేశీని ప్రమోట్ చేస్తోంది మోడీ సర్కారు. వ్యక్తిగత భద్రత, దేశ భద్రతకు ప్రమాదకరంగా మారిన చైనా యాప్‌లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం వాటికి ఆల్టర్నేటివ్‌గా మేడిన్ ఇండియా యాప్‌లను తీసుకొస్తోంది. టిక్‌టాక్‌కు ధీటుగా ఇప్పటికే లోకల్ యాప్‌లు వచ్చాయి. ఇందులో బాగంగానే ట్విట్టర్‌కు బదులుగా దేశీయంగా తయారైన కూ యాప్‌ను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తోంది. బెంగళూరు స్టార్టప్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ, మరో వ్యాపారవేత్త మయాంక్ బిద్వత్క సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారు.
ట్విటర్‌ను పోలినట్లుగా ఉండే ఈ యాప్ అతి త్వరలోనే నెటిజన్లకు చేరువైంది. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్‌లో ఉత్తమ సోషల్‌మీడియా యాప్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ యాప్‌ను 40 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. సామాన్యుల దగ్గర్నుంచి మంత్రుల వరకు ఈ ప్లాట్‌ఫాంలో చేరారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఎంపీలు తేజస్వీ సూర్య, శోభ కరంద్లాజేలతో పాటు ప్రభుత్వ విభాగాలైన నీతి ఆయోగ్, మైగవర్నమెంట్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇండియా పోస్ట్, నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్, సెంట్రల్ బోర్డ్ ఆప్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ తదితర విభాగాలకు ఇందులో ఖాతాలున్నాయి.
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ వంటి కూ డౌన్‌లోడ్ చేసుకున్నారు. కూ యాప్‌కి ఇండియన్ ట్విట్టర్ అనే గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ఈ యాప్ గురించి ప్రస్తావించారు. భారతీయులందరూ ‘కూ’ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ట్విటర్‌లాగే ఉండే ఈ యాప్‌లో ట్విటర్‌లో లేని కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్ అందుబాటులో ఉండటం ఇందులో మరో అడ్వాంటేజ్. ఢిల్లీలో రైతుల ఆందోళన తర్వాత.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం.. ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు విస్తృతంగా వైరల్ కావడంతో.. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని అకౌంట్లు బ్లాక్ చేయాలని ట్విట్టర్‌కు నోటీసులిచ్చింది. అయితే ట్విట్టర్ మేనేజ్‌మెంట్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో… కూ యాప్‌ను ప్రమోట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ట్విటర్‌కు పోటీగా గతంలోనూ చాలా యాప్‌లు వచ్చాయి. గతేడాది ‘టూటర్’, ‘స్వదేశీ’ లాంటి ట్విట్టర్ తరహా యాప్‌లు కూడా వచ్చాయి. అయితే ఇవేవీ ట్విట్టర్‌కు పోటీగా నిలబడలేకపోయాయి. కానీ కూ మాత్రం వీటికి భిన్నంగా ప్రజాదరణ పొందుతోంది. ట్విట్టర్‌లో పిట్ట బొమ్మ ఉంటే… కూ యాప్ కూడా అలాంటి పిట్టతోనే వస్తోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడు చేసుకోవచ్చు.
Also Read:
ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు
పాలసీలు చేయిస్తారు.. ప్రాణాలు తీసేస్తారు.. కరడుగట్టిన హంతకులు.. సంచలన నిజాలు