Indian Railway: ట్రైన్‌లో ప్రయాణించడానికి ప్రింటెడ్ టికెట్ తీసుకెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి బిగ్ అలర్ట్..

రైలులో ప్రయాణించేటప్పుడు అన్ రిజర్వ్‌డ్ టికెట్లకు ప్రింటెడ్ టికెట్ అవసరమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దీనిపై రైల్వేశాఖ స్పష్టత ఇచ్చింది. ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Indian Railway: ట్రైన్‌లో ప్రయాణించడానికి ప్రింటెడ్ టికెట్ తీసుకెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి బిగ్ అలర్ట్..
Train Ticket

Updated on: Dec 20, 2025 | 3:11 PM

ఇండియన్ రైల్వేలో తరచూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. రోజూ లక్షలమంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. దూరపు ప్రయాణాలు చేసేవారికి రైళ్లల్లో సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో దూరపు లేదా రాత్రిపూట ప్రయాణాలు చేసేవారు ట్రైన్లలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లు కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు పొందుతున్నారు. అయితే డిజిటల్‌గా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఫిజికల్ కాపీలను ఎవరూ తమ దగ్గర ఉంచుకోవడం లేదు. ఇక రిజర్వేషన్ లేని టికెట్లకు ప్రింటెడ్ కాపీ అవసరమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది.అ

అన్ రిజర్వ్‌డ్ టికెట్లకు అవసరం లేదు

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్‌డ్ టికెట్లకు హార్డ్ కాపీ అవసరం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ మొబైల్‌కు వచ్చే మెస్సేజ్‌ వివరాలను చూపిస్తే సరిపోతుందని తెలిపింది. ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న నిబంధలను పాటించాలని, వాటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ లేని టికెట్లకు ప్రింటెడ్ కాపీ తప్పనిసరి కాదని పేర్కొంది. ఒకవేళ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లకు ప్రింటెడ్ కాపీ ఉంటే అది ఉంచుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న అన్ రిజర్వ్‌డ్ టికెట్లకు హార్డ్ కాపీ అవసరం లేదని, మొబైల్‌లో మెస్సేజ్ చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ప్రయాణికులు రైల్వే సమాచారం కోసం అధికారిక ఫ్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. రైల్వేశాఖ ప్రకటనతో ప్రింటెడ్ టికెట్‌పై ప్రయాణికుల్లో ఉన్న ఆందోళన తొలగింది.