India-Pakistan Border: భారత్ – పాకిస్తాన్ బార్డర్ లో కలకలం.. అర్ధరాత్రి డ్రోన్ సంచారం..

| Edited By: Amarnadh Daneti

Oct 03, 2022 | 3:07 PM

భారత్ - పాకిస్తాన్ బార్డర్ లో రోజూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాయుధ బలగాలు నిరంతరం సెక్యూరిటీలో ఉన్నా పాక్ చొరబాటు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టెక్నాలజీని ఉపయోగించి భారత్‌లో విధ్వంసాలకు..

India-Pakistan Border: భారత్ - పాకిస్తాన్ బార్డర్ లో కలకలం.. అర్ధరాత్రి డ్రోన్ సంచారం..
Drone
Follow us on

భారత్ – పాకిస్తాన్ బార్డర్ లో రోజూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాయుధ బలగాలు నిరంతరం సెక్యూరిటీలో ఉన్నా పాక్ చొరబాటు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టెక్నాలజీని ఉపయోగించి భారత్‌లో విధ్వంసాలకు కుట్ర చేస్తోంది. డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంపిస్తోంది. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్‌లో సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన బీఎస్ఎఫ్ జవాన్లు డ్రోన్ పై కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ నుంచి 3 కిలోల కంటే ఎక్కువైన హెరాయిన్ పడిపోయింది. అనంతరం ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా 3.5 కిలోల అనుమానిత హెరాయిన్‌తో కూడిన నాలుగు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారుర. ఈ సంఘటన శనివారం-ఆదివారం మధ్య రాత్రి జరిగింది. అనుప్‌గఢ్ సమీపంలో డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి. డ్రోన్ ప్యాకెట్లను పడవేసిందని, తరువాత వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

బీఎస్ఎఫ్ సమాచారంతో స్థానిక పోలీసులు స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. తదుపరి విచారణ కోసం బీఎస్ఎఫ్ ద్వారా అనుమానిత హెరాయిన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)కి అప్పగించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. దసరా వేడుకలు, నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడంతో సైనికులు అలర్ట్ అయ్యారు. ముమ్మరంగా పహారా కాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం