చనిపోయాడని ఖననం చేసిన వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్.. దెబ్బకు ఫ్యూజులు ఔట్..

ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆచూకీ కోసం వెదికారు. అయినా జాడ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అది తప్పిపోయిన వ్యక్తిదే అని భావించి.. ఆ కుటుంబసభ్యులు..

చనిపోయాడని ఖననం చేసిన వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్.. దెబ్బకు ఫ్యూజులు ఔట్..
Phone Call

Updated on: Feb 06, 2023 | 5:55 PM

ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆచూకీ కోసం వెదికారు. అయినా జాడ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అది తప్పిపోయిన వ్యక్తిదే అని భావించి.. ఆ కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు. కానీ.. అప్పుడే వారికి ఓ ట్విస్ట్ కలిగింది. ఖననం చేసిన వ్యక్తి.. బతికే ఉన్నానంటూ ఫోన్ చేయడంలో షాక్ లో ఉండిపోయారు ఆ కుటుంబసభ్యులు… మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో రిఫీక్‌ షేక్‌ అనే 60 ఏళ్ల వృద్ధుడు.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం తప్పిపోయాడు. అతని కోసం కుటుంబసభ్యులు అంతా వెదికారు. అయినా లాభం లేదు. దీంతో వారు ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. రిఫీక్ ను ఎలాగైనా తిరిగి తమ వద్దకు చేర్చాలని వేడుకున్నారు.

అయితే.. జనవరి 29న బోయిసర్-పాల్ఘర్ స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు అతడి ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది చూసిన ఓ వ్యక్తి రైల్వే పోలీసులను సంప్రదించి అతను తన సోదరుడు రఫీక్‌ షేక్‌ అని చెప్పాడు. అతను తప్పిపోయినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. రఫీక్‌ భార్యకూడా మృతి చెందింది తన భర్తే అని గుర్తించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని రఫీక్‌ కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుంటుంబికులు ఆ మృతదేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహంచారు.

ఇదిలా ఉంటే.. రఫీక్‌ తాను బతికే ఉన్నానంటూ ఓ రోజు తన స్నేహితుడికి సడెన్‌గా కాల్‌ చేశాడు. దీంతో షాక్ అయిన అతని స్నేహితుడు వీడియో కాల్‌ చేసి మాట్లాడితే కానీ అతను నమ్మలేదు. ఈ విషయాన్ని అతను షేక్‌ కుటుంబీకులకు చెప్పాడు. అతన్ని చూసి ఆ కుటుంబం ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది. అంతేకాదు వారు ఈ విషయాన్నిపోలీసులకు తెలియజేయడంతో వారు ఖననం చేసిన మృతదేహన్ని వెలికితీసి.. అతను ఎవరో కనిపెట్టి పనిలో పడ్డారు. ఆ వృద్ధుడు కొద్ది నెలల వరకు పాల్ఘర్‌లోని ఒక నిరుపేద ఇంటిలో ఉన్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం