Indian Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రూ. 28వేల కోట్ల ఆయుద్ధ సంపత్తి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్..

దేశ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు దాయాది దేశమైన పాకిస్తాన్, మరోవైపు..

Indian Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రూ. 28వేల కోట్ల ఆయుద్ధ సంపత్తి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్..

Updated on: Dec 18, 2020 | 11:30 AM

Indian Govt: దేశ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు దాయాది దేశమైన పాకిస్తాన్, మరోవైపు సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా దేశాలు భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో.. భారత త్రివిద దళాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఆయుధాలను సమకూర్చాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా రూ. 28వేల కోట్ల విలువైన ఆయుధాలు, మిలటరీ పరికరాలు, నేవి దళానికి సంబంధించిన ఆరు ఎయిర్‌బోర్న్ వార్నింగ్, కంట్రోల్ సిస్టమ్ విమానాల కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు రూ. 9వేల కోట్ల వ్యయంతో నేవీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ ఆఫ్‌ఫోర్ పెట్రోలింగ్ వెసెల్స్‌ను కూడా కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని డీఏసీ(డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్) ఆమోద ముద్ర వేసినట్లు అధికారల సమాచారం.

 

Also read:

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఇక కష్టకాలమేనా..? పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవడం పెద్ద సవాలే

ఒకే ఫ్రేమ్ లోకి రామ్ చరణ్.. ప్రభాస్, ఫ్యాన్స్ ఫుల్ జోష్.. నెట్టింట్లో వైరల్