
జమ్ము కశ్మీర్‌లో టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. విజయ్‌కుమార్ స్వస్థలం రాజస్థాన్. దేహతి బ్యాంక్ కుల్గామా బ్రాంచ్‌లో మేనేజర్‌ను పనిచేస్తున్నారు విజయ్‌కుమార్.. బ్యాంక్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముఖానికి మాస్క్ ధరించిన టెర్రరిస్టులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో విజయ్‌కుమార్ చనిపోయారు. 45 రోజుల క్రితమే విజయ్‌కుమార్‌కు పెళ్లయ్యింది. కశ్మీర్‌లో వరుసగా హిందూ ఉద్యోగులను ఉగ్రవాదులు టార్గెట్ చేయడం తీవ్ర సంచలనం రేపింది. బుధవారం కూడా రజనీ అనే స్కూల్ టీచర్‌ను హత్య చేశారు ఉగ్రవాదులు. బ్యాంక్ మేనేజర్ విజయ్‌మార్ హత్యను జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో హిందూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు కశ్మీర్‌లో రక్షణ లేదని , స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని నినాదాలు చేశారు. కొద్దిరోజుల క్రితమే కశ్మీర్ పండిట్ రాహుల్‌భట్‌కు కూడా కాల్చి చంపారు ఉగ్రవాదులు. కుల్గాంలో 72 గంటల్లో ఇద్దరిని హత్య చేయడం సంచలనం రేపింది. గత 11 నెలల్లో 9 మంది హిందూ ఉద్యోగులకు కాల్చి చంపారు ఉగ్రవాదులు.
హిందూ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు
గత కొంతకాలంగా ఉగ్రవాదులు హిందూ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లోయలో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల బుద్గామ్‌లో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను, కుల్గామ్‌లో ఓ మహిళా టీచర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీనిని కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. లోయలో నిరంతర సంఘటనల తరువాత వలస వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ సురక్షిత ప్రదేశంలో ఉంచాలని కశ్మీరీ పండిట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district.
The bank manager later succumbed to his injuries.
(CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI
— ANI (@ANI) June 2, 2022
స్వస్థలాలకు బదిలీ చేయాలని డిమాండ్
హిందూ పౌరులను ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లోయలో జరిగిన హత్యల తరువాత పరిపాలన వారి భద్రత కోసం పెద్ద అడుగు వేసింది. కాశ్మీర్‌లో పోస్ట్ చేయబడిన వలసదారులను, జమ్ము డివిజన్‌లోని ఇతర ఉద్యోగులను భద్రత దృష్ట్యా ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద జూన్ 6 లోగా లోయలోని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జమ్ము పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, కశ్మీర్ డివిజన్‌లో PM ప్యాకేజీ కింద పోస్ట్ చేయబడిన మైనారిటీ వర్గాల ఉద్యోగులను వెంటనే సురక్షిత ప్రదేశాలకు పోస్ట్ చేస్తారు.