Surrogacy: మా సరోగసి విధానాన్ని పూర్తి చేసేలా వెసులుబాటు ఇవ్వండి.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన జంట

సరోగసికి(Surrogacy) సంబంధించిన రెండు చట్టాలను గతేడాది డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో భారతదేశంలో దాదాపు 10-15 శాతం మంది దంపతులు సంతానానికి నోచుకోలేకపోతున్నరాని, అలాంటి వారి సంఖ్య...

Surrogacy: మా సరోగసి విధానాన్ని పూర్తి చేసేలా వెసులుబాటు ఇవ్వండి.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన జంట
Surrogacy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 02, 2022 | 1:22 PM

సరోగసికి(Surrogacy) సంబంధించిన రెండు చట్టాలను గతేడాది డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో భారతదేశంలో దాదాపు 10-15 శాతం మంది దంపతులు సంతానానికి నోచుకోలేకపోతున్నరాని, అలాంటి వారి సంఖ్య 27.5 మిలియన్లు ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరు గర్భం దాల్చాలనుకుంటున్నప్పటికీ అది సాధ్యపడటం లేదని వెల్లడించింది. తద్వారా వీరిలో కొందరు సరోగసి ద్వారా పిల్లలను కనేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. అయితే పార్లమెంట్(Parliament of India) ఆమోదించిన రెండు చట్టాల ద్వారా ఈ ప్రక్రియ కష్ట సాధ్యంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ఈ బిల్లును సెప్టెంబర్ 14, 2020న లోక్‌సభలో(Lok Sabha) ప్రవేశపెట్టారు. ఇది దేశంలో సహాయక పునరుత్పత్తి సాంకేతిక సేవల నియంత్రణ కోసం అందించాలని కోరింది. ప్రతి క్లినిక్ బ్యాంకు తప్పనిసరిగా నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్ ఆఫ్ ఇండియా కింద నమోదు చేయాల్సిందేనని చట్టాలు స్పష్టం చేస్తు్న్నాయి. సెలబ్రిటీలు అద్దె గర్భం కోసం వెళ్లిన కొన్ని కేసులు మినహాయించి, దాదాపు అన్ని క్లినిక్‌లు దంపతులకు పూర్తి వైద్య పరీక్షల తర్వాతే ఐవీఎఫ్ ను సూచిస్తాయని వైద్యులు తెలిపారు.

అయితే.. సరోగసీ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ (ART) యాక్ట్‌కు ముందే తాము సరోగసి విధానాన్ని ప్రారంభించామని, దీనిని పూర్తి చేసేందుకు అనుమతివ్వాంటూ ఓ జంట కోర్టును ఆశ్రయించింది. వైద్యపరమైన సమస్య కారణంగా సహజంగా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం లేకపోవడంతో తాము సరోగసి విధానాన్ని ఆశ్రయించామని న్యాయస్థానానికి తెలిపారు. ప్రభుత్వం చట్టరూపం చేసిన విధానాలతో సరోగసి విధానంలో సంతానాన్ని పొందే అవకాశాన్ని తీసివేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. బిడ్డను కనకపోవడం వల్ల వారు తీవ్ర మనోవేదనకు గురై, మానసిక క్షోభ అనుభవిస్తారని ఆందోళన చెందుతున్నారు.

2020లో భారతదేశ ఐవీఎఫ్ మార్కెట్ విలువ $793.27 మిలియన్లుగా ఉంది. అది 2021 నుంచి 2030 వరకు 16.45 శాతం నమోదుతో $3,721.99 మిలియన్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చట్టబద్దమైన సరోగసి విధానం ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులు నిబంధనలకు లోబడి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఐదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. మరో ఐదేళ్లపాటు దీనిని రెన్యువల్ చేసుకోవచ్చు. సరోగసి నియంత్రణ చట్టం జూలై 15, 2019న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2021 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత 2022 జనవరి నుంచి అమలులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ చట్ట పరిమితులకు లోబడి సరోగసీ క్లినిక్‌లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోకుండా ఎలాంటి సరోగసి కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఇలా చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..