క్రేజీ స్టిల్స్ తో కవ్విస్తున్న ప్రియాంక మోహన్

Phani CH

28 December 2024

ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

1994 నవంబర్ 20న జన్మించిన ఈ భామ కన్నడ తల్లికి తమిళ తండ్రికి తమిళనాడులోని మద్రాసులో పుట్టి పెరిగింది ఈ చిన్నది.

అంతేకాదు అక్కడే ఉన్న పెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (PESIT)లో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేసింది.

ఒకానొక సమయంలో వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస హిట్లతో ముందుకెళ్తుందనే చెప్పాలి.

రీసెంట్ గా సరిపోదా శనివారంతో సినిమా  హిట్ కొట్టి.. వరుస అవకాశాలతో  దూసుకుపోతుంది ఈ చిన్నది ప్రియాంక మోహన్.

ప్రియాంక మోహన్ ధనుష్‌తో కలిసి కెప్టెన్ మిల్లర్‌లో నటించింది. ఎప్పుడూ జెంటిల్‌ గాళ్‌గా నటించే ప్రియాంక మోహన్‌ ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌లో ఫైటర్‌గా నటించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్స్ రానున్నాయి.