త్రిష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. రెండు దశాబ్దాలుగా సౌత్‌ని ఏలుతుంది ఈ ముద్దుగుమ్మ..
త్రిష. 1983లో చెన్నైలో పుట్టింది. ఈ ముద్దుగుమ్మ మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
1999లో ఓ చిన్న క్యారెక్టర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత వరుస ఆఫర్స్, హిట్స్ అందుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోని అందరి స్టార్ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది త్రిష. ఫేడవుట్ అయిపోయింది అనుకున్న టైమ్ లో మళ్లీ దూసుకొచ్చింది. యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది.
ప్రస్తుతం త్రిష.. విజయ్ తో డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయ్. ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ...కెరీర్ విషయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటోంది త్రిష.
ప్రస్తుతం త్రిష చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థమవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.