మరోసారి ప్రియాంక తమిళ్ పైనే ఫోకస్ పెట్టనుందా.? ఓజీ తర్వాత అటేనా..

Rajeev 

28 December 2024

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మనసు దోచేసిన ముద్దుగుమ్మల్లో ప్రియాంక మోహన్ ఖచ్చితంగా చెప్పాల్సిందే..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

అందమైన రూపంతో క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక మోహన్. ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో నటించింది

ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ చిన్నది తమిళ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది.

తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక రీసెంట్ గా తెలుగులో మరో హిట్ అందుకుంది. 

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమాతో ప్రియాంక మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా చేస్తుంది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తప్ప మరో కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు ఈ అందాల భామ.