Terrorist Attack: పుల్వామాలోని గదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు మరోసారి సామాన్య ప్రజలను టార్గెట్ చేశారు . గదూరా ప్రాంతంలో బయటి కూలీలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు . ఈ ఉగ్రదాడిలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటన అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కున్నారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు పోలీసులు. పుల్వామాలోని గదూరా ప్రాంతంలో గురువారం సాయంత్రం కొందరు కూలీలు పని చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న కొందరు ఉగ్రవాదులు గ్రెనేడ్లతో కార్మికులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఒక కార్మికుడు మృతి చెందాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదుల దాడిలో మరణించిన కార్మికుడిని బీహార్‌లోని పర్సా నివాసి మహ్మద్ ముంతాజ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను బీహార్‌లోని రాంపూర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్, మహ్మద్ మజ్‌బూల్‌గా గుర్తించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
Jammu & Kashmir | A tempo traveller accident reported near Kela Morh, Ramban on NH-44. Four persons feared dead. More updates to follow: Deputy Commissioner, Ramban
— ANI (@ANI) August 4, 2022
గురువారం సాయంత్రం కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా.. ఉగ్రవాదులు కార్మికులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కార్మికుడు మృతి చెందాడు. జమ్మూ కాశ్మీర్‌లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో త్రివర్ణ పతాక ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై ఉగ్రవాదులు ఇప్పటికే బెదిరింపులకు దిగారు. ఈ ప్రచారాన్ని మరింత ప్రభావవంతం చేయడానికి, ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రత్యేక ప్రచారం నిర్వహించబడుతుంది. ప్రతి పౌరుని హృదయంలో దేశభక్తిని పెంపొందించడమే ఈ ప్రచారం ఉద్దేశ్యం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి