Road Accident: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లాయి. ముంబై-పన్వేల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పన్వేల్ నుంచి ముంబైకి వెళ్తున్న ఓ కారు నెరుల్ వద్ద ఎల్‌పి ఫ్లైఓవర్‌పై ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. ముందు ఉన్న కారును బలంగా ఢీకొట్టి దానిపైకి ఎక్కేసింది. ఆ వెనుకే వస్తున్న మరో ఐదు కార్లు అదుపు తప్పు.. ఒకదానిని మరొకటి ఢీకొట్టాయి. బ్రిడ్జిపై ఏడు కార్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అయితే, ఆ ప్రాంతంలోని వాతావరణం సరిగా ఉండదని, వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణం అని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు గంటసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలను తొలగించారు. కాగా, సియోన్-పన్వెల్ హైవే ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అతి ముఖ్యమైన రహదారుల్లో ఒకటి.
Also read:
చతికిలబడిన గబ్బర్ సేన.. మూడేళ్ల తర్వాత భారత్‌పై లంక విజయం.. సిరీస్ 1-1తో సమం..
Hyderabad Water Board: అక్రమంగా అదనపు నల్లా కనెక్షన్లు గుర్తింపు.. ఏడుగురిపై కేసు నమోదు