Femina Miss India 2020: తెలంగాణ అమ్మాయే మిస్ ఇండియా.. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‏గా నిలిచిన మానస..

తెలంగాణ అమ్మాయి మానస అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన వీఎల్‏సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస వారణాసి

  • Rajitha Chanti
  • Publish Date - 6:56 am, Thu, 11 February 21
Femina Miss India 2020: తెలంగాణ అమ్మాయే మిస్ ఇండియా.. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‏గా నిలిచిన మానస..
Miss India 2020

Femina Miss India 2020: తెలంగాణ అమ్మాయి మానస అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన వీఎల్‏సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస వారణాసి విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో హరియాణా అమ్మాయి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలవగా.. ఉత్తర్ ప్రదేశ్‏కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‏గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్ ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు. ఈ పోటీలకు మొదటి రౌండ్‏కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. వీఎల్‏సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ సహకరించారు. ఈ పోటీల గ్రాండ్ ఫైనల్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read:

వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు.. 3 రోజులు సెలవులు.. నయా రూల్స్ తేస్తోన్న కేంద్రం..