భర్త కాదు.. దుర్మార్గుడు.. ఫ్రెండ్స్‌తో శృంగారం చేయాలంటూ భార్యకు ఒత్తిడి.. అలా చేసినందుకు చివరికి..

|

Dec 10, 2022 | 4:58 PM

భార్యాభర్తల సంబంధం శాశ్వతం.. అంతా మధ్యలో వస్తారు.. మధ్యలోనే పోతారు.. కానీ, చివరి వరకూ భార్యభర్తలే ఉంటారంటూ పెద్దలు పేర్కొంటుంటారు. భార్యకి భర్త.. భర్తకి భార్య.. ఇలా జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు..

భర్త కాదు.. దుర్మార్గుడు.. ఫ్రెండ్స్‌తో శృంగారం చేయాలంటూ భార్యకు ఒత్తిడి.. అలా చేసినందుకు చివరికి..
Woman
Follow us on

భార్యాభర్తల సంబంధం శాశ్వతం.. అంతా మధ్యలో వస్తారు.. మధ్యలోనే పోతారు.. కానీ, చివరి వరకూ భార్యభర్తలే ఉంటారంటూ పెద్దలు పేర్కొంటుంటారు. భార్యకి భర్త.. భర్తకి భార్య.. ఇలా జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు.. కానీ, ఓ భర్త అత్యంత నీచుడిలా మారాడు.. కట్టుకున్న భార్యను తన స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేశాడు.. అతని మాటలను నిరాకరించిన భార్యను తరచూ వేధించేవాడు.. చివరికి అతని టార్చర్​భరించలేక ఒప్పుకుంది. అయినా అతను మళ్లీ వేధించడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని టెక్కీ తన భార్యను బలవంతం చేశాడని.. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్‌లో కొన్ని వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక సంపిగేహల్లి ప్రాంతంలో నివసిస్తున్న జాన్ అనే టేకీ దంపతులకు 2011లో వివాహమైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భర్త ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రోజూ తాగి రావడంతోపాటు తన ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలంటూ 36 ఏళ్ల వయసున్న భార్యను బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోనందుకూ కొట్టడంతోపాటు తరచూ వేధించేవాడు. అతడి మాటకు పలుమార్లు వ్యతిరేకించిన ఆమె.. టార్చర్​తట్టుకోలేక జాన్ ఇద్దరి స్నేహితులతో 2015లో శృంగారంలో పాల్గొంది. ఈ క్రమంలో వారు సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు వీడియోలు సైతం తీశాడు. ఆ తర్వాత వాటిని దాచిపెట్టాడు.

ఈ క్రమంలో 2019లో తమ ఇంట్లో ఉండేందుకు వచ్చిన మహిళ సోదరిపై కూడా జాన్​కన్నేశాడు. ఆమెను కూడా తన ఫ్రెండ్స్‌తో సెక్స్​లో పాల్గొనేలా చేయాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి నిరాకరించిన మహిళ.. అతనితో విడిపోయేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బాధితురాలి ప్రైవేట్​ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్​చేస్తానంటూ బెదిరించాడు. భర్త బ్లాక్‌మెయిల్‌ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..