IT Raids: ఆల్కహాల్ డిస్టిలరీపై ఐటీ దాడులు.. డబ్బు కట్టలు లెక్కపెట్టలేక అలసిపోయిన కౌంటింగ్‌ మెషీన్స్‌…

|

Dec 08, 2023 | 8:48 AM

పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో డబ్బు లెక్కింపు కోసం తీసుకొచ్చిన యంత్రాలు కూడా పనిచేయడం మానేశాయని ఐటీ అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు 50 కోట్లు మొత్తం నోట్ల లెక్కింపు పూర్తయింది. నోట్లను ఇంకా లెక్కించాల్సి ఉందని అధికారులు చెప్పారు.. కానీ కౌంటింగ్ మిషన్లు చెడిపోవడంతో అధికారులు నోట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

IT Raids: ఆల్కహాల్ డిస్టిలరీపై ఐటీ దాడులు.. డబ్బు కట్టలు లెక్కపెట్టలేక అలసిపోయిన కౌంటింగ్‌ మెషీన్స్‌...
It Raids
Follow us on

ఐటీ శాఖ దాడుల్లో దొరికిన నోట్లను అధికారులు లెక్కపెట్టలేక విసిగిపోయిన కథనాలు ఇప్పటికే అనేకం విన్నాం, చూశాం..కానీ, ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు కట్టలు లెక్కపెట్టలేక కౌంటింగ్‌ యంత్రాలే అలిసిపోయాయి.. వినటానికి షాకింగ్‌ ఉన్నప్పటికీ.. ఇది నిజంగా జరిగింది. ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడుల్లో దొరికిన కోట్ల కోద్దీ నోట్లను లెక్కించలేక కౌంటింగ్ యంత్రాలే అలిసిపోయాయి. అవును, ఒడిశా, జార్ఖండ్‌లో ఐటీ దాడుల్లో దొరికిన డబ్బును చూసి స్వయంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులే షాక్ అవుతున్నారు. బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆదాయపు పన్ను శాఖ వరుస దాడులు నిర్వహించింది. రెండు రోజుల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణలతో మద్యం తయారీ కంపెనీపై అధికారులు దాడులు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్, రాంచీ, జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్‌లోని బుద్ధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీడీపీఎల్)కు చెందిన స్థలాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. బుధవారం వరకు కంపెనీకి సంబంధించిన పలు చోట్ల భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన నగదు మొత్తం రూ. 50 కోట్లకు పైగానే ఉందని అధికారులు వెల్లడించారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో డబ్బు లెక్కింపు కోసం తీసుకొచ్చిన యంత్రాలు కూడా పనిచేయడం మానేశాయని ఐటీ అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు 50 కోట్లు మొత్తం నోట్ల లెక్కింపు పూర్తయింది. నోట్లను ఇంకా లెక్కించాల్సి ఉందని అధికారులు చెప్పారు.. కానీ కౌంటింగ్ మిషన్లు చెడిపోవడంతో అధికారులు నోట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుతో బీడీపీఎల్‌కు వ్యాపార సంబంధాలున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం నుంచి కంపెనీకి చెందిన పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఒడిశాలోని 4, జార్ఖండ్‌లోని 2 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. BDPL డైరెక్టర్లు, కంపెనీ కార్యాలయాలు ఒడిశాలోని రైదీ, సంబల్పూర్ బలంగీర్ జిల్లాలలో ఉన్నాయి. బిడిపిఎల్ కంపెనీ తన నిజమైన వ్యాపార కార్యకలాపాలను దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తోందన్న కచ్చితమైన సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ ఈ చర్య తీసుకుంది. మరో కోటి వరకు నోట్ల లెక్కింపు పెండింగ్‌లో ఉందన్నారు. దీంతో ఐటీ శాఖ అధికారులు ఈరోజు కూడా నోట్లను లెక్కించబోతున్నట్టు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..