DGP : డీజీపీ కీలక ఉత్తర్వులు.. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలో విచారించవద్దు..

|

May 04, 2022 | 7:00 AM

Tamilnadu DGP: ఖైదీలను రాత్రి కస్టడీ విచారణకు గురి చేయకూడదు. సాయంత్రంలోగా జైలుకు తరలించాలి. తమిళనాడు పోలీసు డీజీపీ సైలేంద్రబాబు యాక్షన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. విచారణ నిమిత్తం అరెస్టు చేసిన వ్యక్తులను రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో..

DGP : డీజీపీ కీలక ఉత్తర్వులు.. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలో విచారించవద్దు..
Dgp Sylendra Babu
Follow us on

ఖైదీలను రాత్రి కస్టడీ విచారణకు గురి చేయకూడదు. సాయంత్రంలోగా జైలుకు తరలించాలి. తమిళనాడు(Tamilnadu ) పోలీసు డీజీపీ సైలేంద్రబాబు(DGP Sylendra babu) యాక్షన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. విచారణ నిమిత్తం అరెస్టు చేసిన వ్యక్తులను రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో ఉంచరాదని తమిళనాడు డీజీపీ సైలేంద్రబాబు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో పగటిపూట అరెస్టు చేసిన వారిని సాయంత్రం 6 గంటలలోపు జైలుకు పంపాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులకు మౌఖిక ఉత్తర్వులో ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో ఖైదీలను రాత్రి వేళల్లో విచారించరాదని ఆదేశించారు. చెన్నైలోని తిరువణ్ణామలైలో లాకప్‌లో విచారించిన ఇద్దరు వ్యక్తుల మృతి అనంతరం డీజీపీ ఈ చర్యలు తీసుకున్నారు.

తమిళనాడులో పోలీసు కస్టడీలో మరణాలు, ముఖ్యంగా దళితుల మరణాలపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో  పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పోలీసుల అసమర్థతను ఎత్తి చూపించాయి. సామాన్యుల కోసం ఎవరు వస్తారన్న అహంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

విచారణ నిమిత్తం చెన్నై, తిరువణ్ణామలై తీసుకెళ్లి పోలీసు కస్టడీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ గట్టి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ మొదలైంది. దీంతో పోలీస్ స్టేషన్లలో రాత్రి వేళల్లో అదుపులోకి తీసుకున్న వారిని విచారించవద్దని డీజీపీ సైలేంద్రబాబు అన్ని జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. పగటిపూట అరెస్టు చేసిన వారిని సాయంత్రం 6 గంటలలోపు జైలుకు పంపాలని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చెన్నై మెరీనాలో గుర్రపు స్వారీ చేసేవాడు. అతని స్నేహితుడు సురేష్. ఏప్రిల్ 18 రాత్రి కెల్లీస్ జంక్షన్ వద్ద జనరల్ కాలనీ జి5 పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇద్దరినీ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో విఘ్నేష్ అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. అతడిని పోలీసులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ విఘ్నేష్‌ను పరీక్షించిన వైద్యులు పల్స్‌ తగ్గిపోయిందని.. కిల్‌పాక్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. మార్గమధ్యంలోనే విఘ్నేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?