Chicken: మధ్యాహ్నం చికెన్‌.. సాయంత్రం చేపల ఫ్రై తిన్న యువకుడు.. పాపం చివరకు..

|

Feb 14, 2023 | 5:44 PM

ఓ యువకుడు ఇష్టంతో చికెన్‌ను ఫుల్లుగా లాగించాడు.. మధ్యాహ్నం చికెన్ ఫుల్లుగా తిన్న తర్వాత.. సాయంత్రం చేపల వేపుడు తిన్నాడు.. చివరకు ఊపిరాడక చనిపోయాడు.

Chicken: మధ్యాహ్నం చికెన్‌.. సాయంత్రం చేపల ఫ్రై తిన్న యువకుడు.. పాపం చివరకు..
Chicken Curry
Follow us on

ఓ యువకుడు ఇష్టంతో చికెన్‌ను ఫుల్లుగా లాగించాడు.. మధ్యాహ్నం చికెన్ ఫుల్లుగా తిన్న తర్వాత.. సాయంత్రం చేపల వేపుడు తిన్నాడు.. చివరకు ఊపిరాడక చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దిండుగల్‌లో అధికంగా చికెన్‌ తిన్న యువకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. కలికంపట్టికి చెందిన చోలమలై కుమారుడు వసంతకుమార్‌ (22) కార్మికుడిగా పనులు చేస్తున్నాడు. అయితే, ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం ఇంట్లో వండిన చికెన్‌‌ను ఎక్కువగా తిన్నాడు.

అనంతరం, కాసేపు సేదతీరాడు. సాయంత్రం చేపల వేపుడు తిన్నాడు. అనంతరం రాత్రి అతను ఊపిరాడక ఇబ్బంది పడుతూ కనిపించాడు. తనకు ఊపిరి ఆడటం లేదంటూ అవస్థపడుతూ కుటుంబసభ్యులకు తెలిపాడు. అయితే, కొద్దిసేపు నడిస్తే తగ్గుతుందని తల్లిదండ్రులు చెప్పడంతో వీధిలో నడుస్తూ కిరాణా షాపు దగ్గరికి వెళ్లాడు. త్వరగా జీర్ణం అవుతుందని కూల్‌డ్రింక్‌ తాగాడు.

ఆ తర్వాత వీధిలో నడుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్ లో వచ్చిన వైద్యసిబ్బంది పరిశీలించి వసంతకుమార్ అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీంతో చోలామలై దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు చిన్నలాంపట్టి పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..