బంపరాఫర్లు పెట్టిన యజమాని.. షాప్‌ ఓపెనింగ్ రోజే సీజ్‌

కొత్తగా షాప్‌ని ఓపెన్‌ చేయాలనుకున్న ఓ వ్యక్తి, అందరినీ ఆకట్టుకోవడం కోసం బంపరాఫర్లు ప్రకటించారు. అంతే జనం పోటెత్తారు.

బంపరాఫర్లు పెట్టిన యజమాని.. షాప్‌ ఓపెనింగ్ రోజే సీజ్‌

Edited By:

Updated on: Aug 26, 2020 | 6:52 PM

Tamil Nadu shop owner: కొత్తగా షాప్‌ని ఓపెన్‌ చేయాలనుకున్న ఓ వ్యక్తి, అందరినీ ఆకట్టుకోవడం కోసం బంపరాఫర్లు ప్రకటించారు. అంతే జనం పోటెత్తారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడంతో కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఓపెనింగ్ రోజే సీజ్ చేయించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడుకు చెందిన శరవణన్‌ అనే వ్యక్తి మొబైల్ షాప్‌ని ఓపెన్‌ చేయాలనుకున్నాడు. మొదటి రోజు వినియోగదారులను ఆకర్షించడం కోసం రూ.6కే కంపెనీ హెడ్‌ ఫోన్స్‌, మొబైల్ టెంపర్ గ్లాస్ ఇస్తానని భారీగా ప్రచారం చేశాడు. దీంతో ఓపెనింగ్ రోజు పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. ఇది కాస్త కార్పొరేషన్ అధికారుల వరకు వెళ్లడంతో.. శరవణన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడి షాప్‌ని పోలీసులు సీజ్‌ చేశారు.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక అనుమతులు.. టీటీడీ ఆధీనంలోకి 7 దేవాలయాలు

కిమ్‌ ‘కోమా’ కథలకు చెక్‌.. దర్శనమిచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు