Viral: ట్యాంక్‌‌లో పూడిక తీస్తుండగా కనిపించింది చూసి.. నివ్వెరపోయిన గ్రామస్థులు

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. పుదుకోట్టై తాలూకాలోని మేళపులవంకాడు గ్రామంలో ఇటీవల.. ఓ ట్యాంకులో పూడిక తీత పనులు చేస్తుండగా.... నాలుగు అడుగుల ఎత్తున్న రాతితో చేసిన శివలింగం బయటపడింది.

Viral: ట్యాంక్‌‌లో పూడిక తీస్తుండగా కనిపించింది చూసి.. నివ్వెరపోయిన గ్రామస్థులు
Ancient Shiva Lingam
Follow us

|

Updated on: Oct 26, 2024 | 10:09 AM

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మేళపులవంకాడు గ్రామ ప్రజలు అక్టోబరు 21న ట్యాంక్‌లో పూడిక తీస్తుండగా ఒక భారీ రాతి శివలింగాన్ని కనుగొన్నారు. దాదాపు ఒక టన్ను బరువున్న నాలుగు అడుగుల ఎత్తైన లింగం పాక్షికంగా మట్టితో కప్పివేయబడింది. ఇది అనేక వందల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు గ్రామస్థులు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) ఆధీనంలో ఉన్న ట్యాంక్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు గ్రామస్థులు మొదట శివలింగాన్ని గుర్తించారు. పాక్షికంగా కనిపించిన లింగాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు, పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, ట్యాంక్ నుండి లింగాన్ని జేసీబీ సాయంతో జాగ్రత్తగా బయటకు తీశారు. తదనంతరం దానిని పుదుకోట్టై తాలూకా కార్యాలయానికి తరలించారు, ప్రస్తుతం శివలింగాన్ని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.

ఆర్డీఓ ఈశ్వరయ్య, తహసీల్దార్ బరాణితోపాటు రెవెన్యూ అధికారులు శివలింగాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేశారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, వెలికితీసిన శివలింగాన్ని తిరిగి తమకు అప్పగించాలని గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు. ఆ శివలింగం దొరికిన ప్రాంతంలో తిరిగి దాన్ని ప్రతిష్టించి.. ఆలయాన్ని నిర్మించి, రోజువారీ పూజలు నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ సతీష్ కూడా దేవాదాయ శాఖకు అధికారిక అభ్యర్థనను సమర్పించారు.

శివలింగం బయట పడిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. చాలా మంది స్థానికులు ఇది వందల సంవత్సరాల నాటిదని..  గ్రామం  పురాతన వారసత్వంతో ముడిపడి ఉంటుందని నమ్ముతున్నారు. స్థానిక నివాసి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, “ఇది మా గ్రామానికి సంబంధించిన సాంస్కృతిక, మతపరమైన చరిత్రకు చిహ్నం.  ఆలయాన్ని నిర్మించి పూజలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.