Nipah Virus: కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్..

|

Sep 06, 2021 | 5:01 PM

Nipah Virus: మానవులపై ప్రకృతి పగబట్టిందా అనిపించేలా వైరస్ లు మానవులపై దాడి చేస్తున్నాయి. ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కల్లోలం ఇంకా  కొనసాగుతూనే ఉంది.. వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతూనే..

Nipah Virus:  కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్..
Tamil Nadu Nipah Virus
Follow us on

Nipah Virus: మానవులపై ప్రకృతి పగబట్టిందా అనిపించేలా వైరస్ లు మానవులపై దాడి చేస్తున్నాయి. ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కల్లోలం ఇంకా  కొనసాగుతూనే ఉంది.. వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతూనే ఉంది.  ఈ నేపథ్యంలో దేశంలోనే కేరళలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.  దీనికి తోడు సీజనల్ వ్యాధులు.. అది సరిపోనట్లు కేరళలో ఇప్పుడు నిఫా వైరస్ వెలుగు చూసింది. ఇప్పటికే ఒక బాలుడు నిఫా వైరస్ తో మరణించాడు.. మరికొందరు నిఫా వైరస్ బాధితులుగా నమోదయ్యారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేరళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

కేరళ లో నిఫా వైరస్ ఫై హై అలెర్ట్ నేపథ్యంలో ముఖ్యంగా తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. కేరళ – తమిళనాడు సరిహద్దులోని జిల్లాలో ఎమర్జెన్సీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలనీ సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు కన్యాకుమారి, కోయంబత్తూర్ , నీలగిరి తదితర జిల్లాలో..  కేరళ నుండి తమిళనాడుకి వస్తున్న వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ఆదేశించింది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు కేరళ-తమిళనాడు సరిహద్దు జిల్లాలో వాహనతనిఖీలను మరింత కఠినతరం చేశారు. అంతేకాదు వ్యాక్సిన్ సెకండ్ డోసు తీసుకున్న వారికీ మాత్రమే తమిళాడులోకి అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నారు.   ఇప్పటికే 30 వైద్య బృందం మెడికల్ క్యాంపు లను  అధికారులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సరిహద్దు జిల్లాలో వైరస్ లక్షణాలున్నవారిని గుర్తించి వారికీ వైద్య చికిత్సని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

అయితే కేరళ తరువాత తమిళనాడు రాష్ట్రంలో నిఫా వైరస్ కేసు నమోదైందని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ జిఎస్ సమీరన్ మొదట ప్రకటించారు. అనంతరం అదే అది తప్పుడు సమాచారమని తిరిగి తన సోషల్ మీడియా వేదికగా మళ్ళీ కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు సమీరం ట్విట్ చేశారు. అయితే  నిఫా వైరస్ నియంత్రణలో భాగంగా కోయంబత్తూర్ సరిహద్దులో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా వారిని అన్ని రకాలుగా పరీక్షిస్తున్నామని తెలిపారు.

 

Also Read:  కొంతమంది కోసం లక్షాదిమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టలేం.. నీట్ వాయిదాకు సుప్రీం నో..