Tamil Nadu Politics: రాజకీయాలంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్. ఇక తమిళనాడు రాజకీయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ప్రతీ అంశం రచ్చ బండ ఎక్కాల్సిందే. అలాంటిదే ఇప్పుడు మరో వివాదం.. తెరపైకి వచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు కమ్, సినీ నటుడు కమ్, ఎమ్మెల్యే కమ్.. ఉదయనిది స్టాలిన్.. చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఉదయ నిధి గురించే తమిళనాట పెద్ద రచ్చ నడుస్తోంది. ఆ రచ్చ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఉదయనిది స్టాలిన్ ఫోటో ఏర్పాటు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ, సచివాలయం రెండూ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఇప్పటి వరకు సీఎం, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు మాత్రమే ప్రదర్శనగా ఉంటాయి. అయితే తాజాగా డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ సీఎం అయ్యారు. సీఎం అయ్యాక స్టాలిన్ వివాద రహిత సీఎంగా మన్ననలు పొందుతున్నారు. అలాంటి సమయంలో సీఎం స్టాలిన్ కుమారుడు, నటుడు, చేపాక్ ఎమ్మెల్యే ఉదయనిది స్టాలిన్ ఫోటోను అసెంబ్లీ ప్రాంగాణంలో పెట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఫోటోను గమనించిన మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత జయకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయం ఏంటని గట్టిగా ప్రశ్నించారు.
జయకుమార్ ప్రశ్నించిన మాట అలా ఉంచితే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా సీఎం కుమారుడు, ఎమ్మెల్యే ఆయినంత మాత్రాన అలా సీఎం, మాజీ సీఎం ల ఫోటోలు ఉండే చోట ఒక ఎమ్మెల్యే ఫోటో ఉంచడం ఎంటనేది విమర్శలకు తావిస్తోంది. ఇది డీఎంకే ప్రభుత్వం లోని మంత్రుల, ఎమ్మెల్యేల అత్యుత్సాహమే అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Also read:
Weight loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా?.. అయితే మీ డైట్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..