Elephant Retirement: ఏనుగు పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు పలికిన అటవీ అధికారులు..

|

Mar 09, 2023 | 8:47 PM

తమిళనాడు అటవీ శాఖకు చెందిన అనమలై కలీమ్ అనే ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడంలో లేదా తరిమికొట్టడం కోసం పనిచేసింది. అయితే ఆ ఏనుగుకు 60 ఏళ్లు రావడంతో..

Elephant Retirement: ఏనుగు పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు పలికిన అటవీ అధికారులు..
Tn Forest Department Giving Farwell Kaleem
Follow us on

తమిళ, తెలుగు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖలలో పనిచేసి రిటైర్ అయిన ఓ ఏనుగుకు ఘనంగా వీడ్కోలు పలికారు అధికారులు. తమిళనాడు అటవీ శాఖకు చెందిన అనమలై కలీమ్ అనే ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడంలో లేదా తరిమికొట్టడం కోసం పనిచేసింది. అయితే ఆ ఏనుగుకు 60 ఏళ్లు రావడంతో పదవీ విరమణ చేసింది. దాని పదవీ విరమణకు గుర్తుగా కోజికముతి ఏనుగు శిబిరంలో ఆ ఏనుగుకు ఐదుగురు ఫారెస్ట్ రేంజర్లు, ఇతర ఏనుగులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చాయి. కలీమ్.. మణి, కరుప్పన్ అనే రెండు అడవి ఏనుగులను పట్టుకోవడం విజయవంతమైంది. ఇది కలీం 100వ ఆపరేషన్ అని, అయితే వాటిలో ఓ ఏనుగు సత్యమంగళం టైగర్ రిజర్వ్‌లో అదృశ్యమైందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు.. కలీమ్‌ రిటైర్‌మెంట్‌ను తెలుపుతున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ ఏనుగు ఓ లెజెండ్‌, దీని సేవలు ప్రజల హృదయాలను గెలుచుకుంద’ని క్యాప్షన్ట‌తో ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘తమిళనాడులోని కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ఐకానిక్ కుమ్కీ ఏనుగు కలీం 60 ఏళ్ల వయసులో ఈరోజు పదవీ విరమణ చేయడంతో మా కళ్లు చెమ్మగిల్లాయి. హృదయాలు కృతజ్ఞతతో బరువెక్కాయి. 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న ఈ ఏనుగు ఒక లెజెండ్. ఇది గౌరవ గార్డు అందుకున్నాడు. #TNForest #Kaleem’ అని సదరు ఐఏఎస్ అధికారి ట్విట్ చేస్తూ క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కలీమ్ సేవలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోకు 5 లక్షల 81 వేల వీక్షణలు, అలాగే 14 వేల లైకులు వచ్చాయి. ఇంకా నెటిజన్లు వారి వారి స్పందనలను కామంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, కలీమ్ డిసెంబర్ 1972లో ఆక్రమ రవాణా నుంచి తీసుకొచ్చారు. కోజికముతి ఏనుగు శిబిరంలో దాని మావటి పళనిసామి శిక్షణ ఇచ్చారు. పళనిసామి మరణానంతరం ఆయన మేనల్లుడు మణి.. కలీమ్‌కు మావటిగా మారారు. ఇతర కుమ్కీల లాగా పొడుగ్గా లేకపోయినా కలీమ్ పొడవాటి శరీరం, దాదాపు ఐదు టన్నుల బరువు కలిగి ఉంది. అది తన బలం, నిర్భయతకు ప్రసిద్ధి. ఏనుగులు దూకుడుగా మారిన సమయంలో కూడా అన్ని పరిస్థితులను సజావుగా నిర్వహించగల ఈ ఏనుగు సామర్థ్యాన్ని మణి ప్రశంసించారు. మరోవైపు కలీం కేవలం తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలలో కూడా సేవలనందించింది. దీని పదవీ విరమణ ఐదు దశాబ్దాలుగా సాగిన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికింది. వన్యప్రాణుల రక్షణకు కలీమ్ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..