కరోనా అంతం కావాలంటూ యజ్ఞాలు, పూజలు.. ఏకంగా కరోనా దేవి విగ్రహాన్నే ప్రతిష్టించిన పండితులు.. ఎక్కడంటే..

కరోనా అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ నుంచి తమను కాపాడాలంటూ

కరోనా అంతం కావాలంటూ యజ్ఞాలు, పూజలు.. ఏకంగా కరోనా దేవి విగ్రహాన్నే ప్రతిష్టించిన పండితులు.. ఎక్కడంటే..
Corona Devi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 20, 2021 | 3:42 PM

కరోనా అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ నుంచి తమను కాపాడాలంటూ యావత్ భారతీయులు దేవతలను ప్రార్ధిస్తున్నారు. ఈ కరోనా మహమ్మరి తమను వదిలివెళ్లిపోవాలని దేవుళ్లను మొక్కుతున్నారు. అమ్మా కరోనా తల్లీ రక్షించు అంటూ వేడుకుంటున్నారు కొంత మంది ప్రజలు. ఇందుకోసం ఏకంగా తమిళనాడులో ఓ విగ్రహం ఏర్పాటు చేశారు. కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు.

Corona Devi.. కరోనా విపత్తు నుంచి కాపాడాలంటూ దేశ ప్రజలంతా ముక్కోటి దేవతలను మొక్కుకుంటున్నారు. మానవాళిపై విరుచుకుపడుతున్న ఈ ప్రళయాన్ని ఆపాలంటూ అనేక ఆలయాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామచ్చిపురి అధినం శక్తిపీఠంలో కరోనా మారియమ్మన్‌ ఆలయం నిర్మించి, అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విపత్తును దైవమే అంతరింపజేయాలన్న ఉద్దేశంతో కరోనా దేవి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామన్నారు ఆధినం ప్రతినిథి శివలింగేశ్వరస్వామి. దాదాపు 48 రోజుల పాటు మహాయాగం, పూజలు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఈ సమయంలో భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. తమిళనాడులో ఇలా విగ్రహలు ఏర్పాటు చేసి పూజలు చేయడం ఇక్కడ కొత్తేమీ కాదు. గతంలో ప్లేగు వ్యాధి విజృంభించిన సమయంలోనూ మరియమ్మన్ దేవాలయంలో ఇలాగే విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేశారు అక్కడివారు. ఇప్పుడు కూడా అదే రకంగా కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో భారత్ అల్లాడుతోంది. రోజూకు లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడికి గతవారం లాక్‌డౌన్‌ విధించింది. నిత్యవసర సరుకులకు ఉదయం 6 నుంచి 10 గంటలకు వరకు మాత్రమే తెరవడానికి అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32, 26 ,719 కు చేరుకుంది.

ట్విట్..

Also Read: Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..