MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొద్ది నిమిషాలలోనే ఎంకే స్టాలిన్ ఐదు ముఖ్యమైన ఉత్తర్వులపై సంతకం చేశారు, ఇందులో కుటుంబాలకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే, పాల ధరల తగ్గింపు, కరోనా ఆర్ధిక సహాయం నాలుగు వేల రూపాయలు ఉన్నాయి. ఈ ఉత్తర్వులలో కొన్ని అసెంబ్లీ ఎన్నికలకోసం డీఎంకే విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల ఆధారంగా ఉన్నాయి.
ఎంకే స్టాలిన్, ఆయన మంత్రి వర్గ సహచరులతో శుక్రవారం చెన్నైలోని రాజ్ భవన్‌లో గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారంచేయించారు. కరోనావైరస్ మహమ్మారి కింద ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఎంకే స్టాలిన్ ఐదు ఉత్తర్వులపై సంతకం చేశారు.
శుక్రవారం స్టాలిన్ సంతకం చేసిన మొత్తం ఐదు ఆదేశాలు ఇవే..
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చాయి.
Also Read: ప్లాస్మా దానం నిజంగా కొవిడ్‌ను నయం చేస్తుందా..? ప్లాస్మాను ఎప్పుడు, ఎలా దానం చేయాలో తెలుసుకోండి..
Work from Home: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి