Tamil Nadu: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రి అరెస్ట్.. స్టాలిన్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం..

|

Jul 29, 2023 | 12:25 PM

తమిళనాడు, జులై 29: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రచురణకర్త అయిన బద్రి శేషాద్రిని తమిళనాడు పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. మణిపూర్ హింసాకాండ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టుకు కారణం తెలియనప్పటికీ..

Tamil Nadu: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రి అరెస్ట్.. స్టాలిన్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం..
K Annamalai - Badri Seshadri
Follow us on

తమిళనాడు, జులై 29: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రచురణకర్త బద్రి శేషాద్రిని తమిళనాడు పోలీసులు శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు అరెస్టు చేశారు. మణిపూర్ హింసాకాండ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొంటున్నారు. అరెస్టుకు కారణం తెలియనప్పటికీ, సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం), 153 ఎ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం) 505 (1) (B) (ప్రజా దురాచారానికి దారితీసే ప్రకటనలు) లాంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. బద్రి శేషాద్రి గత వారం జూలై 22న ఆధాన్ తమిళ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిపూర్ హింసాకాండ.. కుకీలు, మెయితిస్, నాగా జాతుల గురించి మాట్లాడారు. మణిపూర్ హింసలో అధికార బీజేపీ ప్రభుత్వం పాత్ర గురించి వస్తున్న విమర్శలపై, అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గురించి చేసిన వ్యాఖ్యలపై పెరంబలూరు జిల్లా కున్నం నివాసి, న్యాయవాది కవియరసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. ఇంటర్వ్యూలో బద్రి భారత ప్రధాన న్యాయమూర్తి గురించి మాట్లాడిన తీరు తనను కలవరపరిచిందని కవియరసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మణిపూర్ హైకోర్టు మెయితేయి కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదాపై ఇచ్చిన నిర్ణయం వల్ల మణిపూర్‌లో సమస్యలు ప్రారంభమయ్యాయని పేర్కొంటూనే.. ఈ విషయంలో సుప్రీంకోర్టు వైఖరిని ఆయన విమర్శించారు. CJI చేతిలో తుపాకీని ఉంచవచ్చు.. అతను శాంతి భద్రతలను కాపాడగలరా..? అని ప్రశ్నించారు. బద్రీ సీజేఐ పదవిని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, సుప్రీంకోర్టు గౌరవాన్ని, దేశ న్యాయ వ్యవస్థను కూడా దిగజార్చారని కవియరసు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అన్నామలై ఆగ్రహం..

బద్రి శేషాద్రి అరెస్టును భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై ఖండించారు. సామాన్య ప్రజల అభిప్రాయాలను ఎదుర్కోవటానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ద్రావిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ప్రభుత్వం ప్రతీకారం కోసం.. భవితవ్యం కోసం, అవినీతిని అమలు చేయడం మాత్రమే తమిళనాడు పోలీసు అధికారుల పనా..? అంటూ అన్నామలై ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..