New Parliament Building: ప్రధాని మోడీకి ‘సెంగోల్’ ను అందజేసిన ఆధీనం మఠాధిపతులు.. వీడియో చూశారా?

|

May 27, 2023 | 9:35 PM

మరికొన్ని గంటల్లో కొత్త పార్లమెంట్‌ భవనం ఆవిష్కృతం కానుంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడుకు చెందిన 20 మంది మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా మఠాధిపతులు సెంగోల్‌ రాజదండాన్ని మోడీకి అందించారు.

New Parliament Building: ప్రధాని మోడీకి సెంగోల్ ను అందజేసిన ఆధీనం మఠాధిపతులు.. వీడియో చూశారా?
Pm Narendra Modi
Follow us on

మరికొన్ని గంటల్లో కొత్త పార్లమెంట్‌ భవనం ఆవిష్కృతం కానుంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడుకు చెందిన 20 మంది మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా మఠాధిపతులు సెంగోల్‌ రాజదండాన్ని మోడీకి అందించారు. తిరువాదుతురై అధీనం మఠాధిపతి. ప్రత్యేక విమానంలో మఠాధిపతులు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు 20 అధీనాలకు చెందిన మఠాథిపతులు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని రెండు దశలుగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పాత పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపడుతారు. ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సహా పలువురు సీనియర్‌ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇక పూజ తరువాత అందరూ లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. ఉదయం 9.30గంటలకు లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్‌ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. తరువాత పూజ కార్యక్రమం ఉంటుంది. లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిథులు హాజరుకానున్నారు. పార్లమెంట్‌ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..