Supreme Court: కరోనాతో అనాథలుగా మారిన కుటుంబాలకు అండగా ఉండండి… జిల్లా అధికారులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

|

May 28, 2021 | 7:48 PM

Supreme Court Order: COVID-19 లాక్డౌన్ సమయంలో అనాథలుగా మారిన చిన్నారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం

Supreme Court: కరోనాతో అనాథలుగా మారిన కుటుంబాలకు అండగా ఉండండి... జిల్లా అధికారులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Supreme Court
Follow us on

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. COVID-19 లాక్డౌన్ సమయంలో అనాథలుగా మారిన చిన్నారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పిల్లల రక్షణ, గృహాలలో కోవిడ్ సంక్రమణకు సంబంధించిన కేసులను కోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, అనిరుద్ద బోస్‌తో కూడా ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. వారి ప్రాథమిక అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. కరోనా కారణంగా తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లల ప్రాథమిక అవసరాలు తీరేలా చూడాలని దేశంలోని అన్ని జిల్లా యంత్రాంగాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా వారి పూర్తి డేటాను NCPR వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని పేర్కొంది. ఏ ఒక్క చిన్నారి కూడా ఆకలితో అలమటించకుండా చూడాలని ఉత్తర్వులు జారీ చేసింది.

“అవసరమైన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి … వారి వేదనను అర్థం చేసుకోండి మరియు వారి అవసరాలను వెంటనే పరిష్కరించండి” అని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు మరియు అనిరుద్ద బోస్ ధర్మాసనం ఈ రోజు తెలిపింది.

ఇవి  కూడా చదవండి: అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

విరించి ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి కేటీఆర్.. నిబంధలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

MEIL: తెలంగాణకు మేఘా చేయూత… బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న థాయిలాండ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లు