గత కొద్ది రోజులుగా దేశంలో స్వదేశీ మంత్రం మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాతో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ వాతావరణంతో దేశంలో స్వదేశీ నినాదం భారీగా వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వదేశీ అంటే వీదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని.. స్వదేశీ ఉత్పత్తులు, టెక్నాలజీని ప్రోత్సహించడమని అన్నారు. వీటికి ప్రాధాన్యతనివ్వడమే స్వదేశీ ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలో లభించని వస్తువులు, సంప్రదాయికంగా తయారు కాని టెక్నాలజీని, ఇతర వస్తువులను.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఆర్ధిక విధానం పనిచేయదని మోహన్ భాగవత్ అన్నారు.
#WATCH: …Humari swadeshi yani videsh ka jo kuchh bhi hai sabka bahishkaar, aisa bilkul nahi hai. Humare liye jo upyukt hai, humari sharton par, hum sab lenge: RSS chief Mohan Bhagwat at a virtual book launch event (12.08.2020) pic.twitter.com/5m2GejpyrU
— ANI (@ANI) August 12, 2020
Read More :