AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Politics: అందుకే బీజేపీతో నితీష్ తెగతెంపులు.. సంచలన ఆరోపణలు చేసిన సుశీల్ మోదీ..

బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిని చేయనందుకే బీజేపీతో బంధం తెంచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ మోదీ.. ఓవార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహర్ లో వేగంగా మారిన రాజకీయపరిణామాలపై ఆయన స్పందిస్తూ

Bihar Politics: అందుకే బీజేపీతో నితీష్ తెగతెంపులు.. సంచలన ఆరోపణలు చేసిన సుశీల్ మోదీ..
Sushil Modi
Amarnadh Daneti
|

Updated on: Aug 10, 2022 | 6:41 PM

Share

Sushil Kumar Modi: బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిని చేయనందుకే బీజేపీతో బంధం తెంచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ మోదీ.. ఓవార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహర్ లో వేగంగా మారిన రాజకీయపరిణామాలపై ఆయన స్పందిస్తూ.. నితీష్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది జేడీయూ నేతలు తమను కలిసి నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతి చేయాలని అడిగారని.. అలా చేస్తే బీజేపీ వ్యక్తివ సీఎంగా ఉండి పాలించవచ్చని ప్రతిపాదించారన్నారు.  తమకు సొంత అభ్యర్థి ఉండటం వలన దానికి తాము అంగీకరించలేదన్నారు. అందుకే నితీష్ కుమార్ ఎన్డీయేని వదిలేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2020లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరుతోనే అధికారంలోకి వచ్చామని.. నితీష్ పేరు పనిచేయలేదన్నారు. నితీష్ ప్రభావం చూపించి ఉంటే రెండు పార్టీలకు 150 నుంచి 175 సీట్లు గెలవాల్సి ఉండేదన్నారు. జేడీయూ కేవలం 43 సీట్లనే గెలుచుకుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఒకే రోజు 3 నుంచి 4 ఎన్నికల సభల్లో పాల్గొన్నారని.. ఆఎన్నికల ఫలితం నరేంద్రమోదీకి వచ్చిన మ్యాండేట్ గానే భావించాల్సి ఉంటుందన్నారు.

బీజేపీ ఎవరికీ ద్రోహం చేయలేదని.. నితీష్ కుమార్ ని ఐదు సార్లు బీహార్ సీఎంని చేశామన్నారు. ఆర్జేడీ నితీష్ కుమార్ ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. తాము 5సార్లు చేశామన్నారు. తమ మధ్య 17 ఏళ్ల అనుబంధం ఉందని అంటూ.. నితీష్ కుమార్ రెండుసార్లు తమతో బంధాన్ని తెంచుకున్నారని సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. డి-ఫాక్టో సీఎం తేజస్వి యాదవ్ నే అని, నితీష్ కుమార్ పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ఆర్జేడీ బలం 80 మంది ఎమ్మెల్యేలని, జేడీయూకి కేవలం 45 నుంచి 46 మంది మాత్రమేనని తెలిపారు. లాలూ యాద్ పనితీరు అందరికీ తెలుసని.. నితీష్ కుమార్ నామమాత్రపు సీఎంగానే మిగలబోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా బీహార్ వ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసనలకు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..