SC On Demonetisation: నోట్ల రద్దుపై సంచలన తీర్పు.. కీలక ప్రకటన చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..

|

Jan 02, 2023 | 11:54 AM

నోట్ల రద్దు విషయం దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. దామాషా ప్రకారం నోట్ల రద్దును కొట్టివేయలేమని..

SC On Demonetisation: నోట్ల రద్దుపై సంచలన తీర్పు.. కీలక ప్రకటన చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..
Demonetisation
Follow us on

నోట్ల రద్దు విషయం దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. దామాషా ప్రకారం నోట్ల రద్దును కొట్టివేయలేమని పేర్కొన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చింది. 2016 డీమానిటైజేషన్‌పై దాఖలైన 58 పిటిషన్లను పరిశీలించిన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోట్ల రద్దు నిర్ణయం సరైదేనంటూ అభిప్రాయపడింది. దామాషా ప్రకారం.. ఆర్బీఐ తీసుకున్న నోట్ల రద్దును కొట్టివేయలేమంటూ జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

పెద్దనోట్ల రద్దును సమర్థించిన ధర్మాసనంలోని నలుగురు సభ్యులు.. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ విడుదల చేసిన 2016 నవంబర్‌ 8 నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. సుధీర్ఘంగా వాదనలు విన్న జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని బెంచ్‌లోని ఇతర సభ్యులు జస్టిస్‌లు బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్ నోట్ల రద్దును సమర్థించగా.. జస్టిస్ బివి నాగరత్న మెజారిటీ అభిప్రాయానికి భిన్నమైన తీర్పును ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 26(2) అధికారం కింద బ్యాంక్ నోట్లను డీమోనిటైజ్ చేయడానికి ఉపయోగించవచ్చని.. ఏదైనా నిర్దిష్ట సిరీస్‌ని కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సెక్షన్ 26(2) ఆర్‌బిఐ చట్టం ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయలేమని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో సుధీర్ఘంగా వాదనలు వినిపించాయి. ప్రభుత్వం కూడా వారికి కౌంటర్ ఇస్తూ పలు వాదనలు వినిపించింది. స్పష్టమైన ఉపశమనం లభించింది.. పెద్ద నోట్ల రద్దు అనేది మంచిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది. నకిలీ డబ్బు, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్లధనం, పన్ను ఎగవేతలను ఎదుర్కోవడానికి ఇలా చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..