Supreme Court Of India: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధం అంటూ..

|

May 05, 2021 | 11:19 AM

Supreme Court: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Supreme Court Of India: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధం అంటూ..
Supreme Court
Follow us on

Supreme Court Of India: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మరాఠా రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే మరాఠా రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టేసింది. స్టేట్ రిజర్వేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ యాక్ట్ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అవగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

మరాఠా రిజర్వేషన్లతో మొత్తం 50శాతం రిజర్వేషన్ల సీలింగ్ దాటుతుందని ధర్మాసనం వెల్లడించింది. కాగా, రిజర్వేషన్లు 50శాతతం దాటరాన్న 1992 నాటి సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించేందుకు ధర్మాసనం నిరాకరించింది. రిజర్వేషన్లు 50శాతం దాటి ఇచ్చేందుకు తగిన ప్రత్యేక కారణాలను మహారాష్ట్ర సర్కారు సంబంధిత ఉత్తర్వుల్లో పొందుపర్చలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే.. మరాఠా సామాజికవర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినట్లు పేర్కొనలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Also read:

Nonuplets: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. తొమ్మిది మంది.. పిల్లలను కన్న మహాతల్లి ఎక్కడో తెలుసుకోవాలనుందా?

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 6 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..

India Corona Updates: భారత్‌లో కరోనా విలయతాండవం.. దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు