Supreme Court: మహిళలు కుమారి, శ్రీమతి లాంటి పదాలు పెట్టుకోవద్దంటూ పిటీషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే

సాధారణంగా మహిళలు తమ పేరుకు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకుంటారు. అయితే దీనికి సంబంధించిన విషయంపై ఒకరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పేరుకు ముందు ఇలాంటి పదాలు పెట్టుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు.

Supreme Court: మహిళలు కుమారి, శ్రీమతి లాంటి పదాలు పెట్టుకోవద్దంటూ పిటీషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
Supreme Court Of India

Updated on: May 16, 2023 | 10:44 AM

సాధారణంగా మహిళలు తమ పేరుకు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకుంటారు. అయితే దీనికి సంబంధించిన విషయంపై ఒకరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పేరుకు ముందు ఇలాంటి పదాలు పెట్టుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పిటీషన్‌కు కొట్టివేసింది. అసలు ఇది ప్రచారానికి దాఖలు చేసిన దావాలా కనిపిస్తోందంటూ పేర్కొంది.

అసలు మీరు మా నుంచి కోరుకుంటున్న ఊరట ఏంటి.. ఇది కేవలం ప్రచారానికి వేసినట్లు ఉంది అంటూ తెలిపింది. మహిళలు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోకుండా ఉండాలని మీరు కోరుకుంటే వారిని ఎలా నిరోధిస్తారు అంటూ పిటీషనర్‌ను ప్రశ్నించింది. దీనికి అసలు సాధారణ పద్ధతి అంటూ ఏదీ లేదని తెలిపింది. శ్రీమతి, కుమారి లాంటి పదాలు పేరుకు ముందు పెట్టుకోవడం ఆ వ్యక్తి ఎంపికపై ఆధారపడి ఉంటుందని.. అది వాళ్ల ఇష్టమంటూ తీర్పునిస్తూ పిటీషన్‌ను తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..