నిర్భయ కేసులో ఓ దోషి అయిన ముకేష్‌కి మరో దెబ్బ.. తన పిటిషన్ ని అత్యవసరంగా సోమవారం విచారించాలంటూ అతగాడు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే దీనిపై ఈ నెల 16 న విచారణ జరపాలని నిర్ణయించింది. తన మెర్సీ పిటిషన్ ని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ లోగడ ముకేష్ దాఖలు చేసిన పిటిషన్ ని కూడా కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జైల్లో తను పడిన బాధలే ఆ పిటిషన్ దాఖలు చేయడానికి కారణమన్న అతని వాదనను నాడు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిర్భయ కేసులో దోషులు ఇలా తమ ఉరిని జాప్యం చేసేందుకు గల అన్ని మార్గాలనూ వినియోగించుకుంటున్నారు. ఈ దోషులు నలుగురినీ ఈ నెల 20 వ తేదీ తెల్లవారుజామున అయిదున్నర గంటలకు ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది.