Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు..

లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో ప్రారంభమైన విచారణ.. టీటీడీ తరఫున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్గి అభిప్రాయపడ్డారు,,

Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 04, 2024 | 11:43 AM

లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో ప్రారంభమైన విచారణ.. టీటీడీ తరఫున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్గి అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్‌ మెహతా అభిప్రాయపడ్డారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయ్ అన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు జస్టిస్ గవాయ్ తెలిపారు. స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ లడ్డు కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర సిట్‌ను కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్‌లో ఇద్దరు సీబీఐ అధికారులు ఉంటారు. ఇది కాకుండా, బృందంలో రాష్ట్ర పోలీసు నుండి ఇద్దరు వ్యక్తులు, FSSAI నుండి ఒక అధికారి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ పాత సిట్‌పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, కోర్టు కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ విషయంలో రాజకీయ డ్రామలు వద్దు:

తిరుమల లడ్డూ వ్యవహరాంలో రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని, స్వతంత్ర సంస్థ ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది.

ఇదిలా ఉండగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గత ప్రభుత్వం హయాంలో తిరుపతిలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తర్వాత రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో మూడు కంటే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన వారిలో సుబ్రమణ్యస్వామి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్‌లు ఉన్నారు. వీటిపై సెప్టెంబర్ 30న విచారణ జరిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో దేవుడిని కనీసం రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..