‘ మహా ‘ పొలిటికల్ సీన్..’ సుప్రీం ‘ వాయిదా ఎందుకు ?

| Edited By: Srinu

Nov 25, 2019 | 5:21 PM

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు సోమవారం ముగింపు పలుకుతుందని, కోర్టు తీర్పుతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటుందని ఆశించినవారి కలలు కల్లలే అయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు వాయిదా వేసి..సస్పెన్స్ ని కొనసాగిస్తోంది. మొదట 24 గంటల్లోగా శాసన సభలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొద్ది సేపటికే.. సీన్ మారిపోయింది. అజిత్ పవార్ […]

 మహా  పొలిటికల్ సీన్..  సుప్రీం  వాయిదా ఎందుకు ?
Follow us on

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు సోమవారం ముగింపు పలుకుతుందని, కోర్టు తీర్పుతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటుందని ఆశించినవారి కలలు కల్లలే అయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు వాయిదా వేసి..సస్పెన్స్ ని కొనసాగిస్తోంది. మొదట 24 గంటల్లోగా శాసన సభలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొద్ది సేపటికే.. సీన్ మారిపోయింది. అజిత్ పవార్ నేతృత్వంలోని 54 మంది ఎమ్మెల్యేలతో బాటు మొత్తం 170 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ కోర్టుకు చెప్పుకుంది. అదే సమయంలో తమకు 154 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని అంటూ సేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ పేర్కొంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాయి. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 105 మంది శాసన సభ్యులున్నారు. మెజారిటీ మార్క్.. అంటే 145 కి చేరుకోవాలంటే ఈ పార్టీకి మరో 40 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సపోర్టును గవర్నర్ కూడా పరిశీలించారని, ఇదేమీ ఫోర్జరీ చేసిన లేఖ కాదని, బీజేపీ, ఫడ్నవీస్ తరఫున వాదించిన న్యాయవాది ముకుల్ రోహత్గి వివరించారు. మరోవైపు – తమకు 54 మంది సభ్యుల సపోర్ట్ ఉందని అజిత్ పవార్ పేర్కొన్నారని, అందుకు సంబంధించిన మద్దతులేఖలను అందజేశారని గవర్నర్ తరఫు అడ్వొకేట్ కూడా అయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. వారి సంతకాలతో కూడిన లేఖలను అజిత్ ఈ నెల 22 న అందజేశారని, వాటిని పరిశీలించిన తరువాతే గవర్నర్ కోష్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఫడ్నవీస్ ను ఆహ్వానించారని ఆయన చెప్పారు. ఈ లేఖల విషయంలో గవర్నర్ ను అనుమానించాల్సిన అవసరమే లేదన్నారు.

కాంగ్రెస్ తరఫున వాదించిన అభిషేక్ సింఘ్వీ.. బలపరీక్షకు తగిన వేదిక శాసన సభేనని, ఫార్మాలిటీస్ ఏవీ అవసరం లేదని అన్నారు. అటు-తమ జాబితా చట్ట బధ్ధంగా ఉందని అజిత్ పవార్ తరఫు న్యాయవాది మణీందర్ సింగ్ పేర్కొన్నారు. ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా అజిత్.. బీజేపీకి మద్దతునివ్వాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఆ అధికారం ఆయనకు ఉందన్నారు. కాగా-బీజేపీ తనకు మెజారిటీ ఉందని భావిస్తే 24 గంటల్లోగా అసెంబ్లీలో దాన్ని నిరూపించుకోవాలని ఎన్సీపీ, కాంగ్రెస్, సేన తరఫు లాయర్ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కోర్టు ఆదేశించాలన్నారు. ఈ మూడు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు.. తీర్పునకు అవసరమైన మరింత సమయం కోసం దాన్ని రిజర్వ్ లో ఉంచుతూ.. మంగళవారానికి వాయిదా వేసింది.