Supreme Court of India: పెళ్లి చేసుకుని ఏటా ఒకరిని చంపాలా?.. న్యాయవాదికి షాక్ ఇచ్చిన సుప్రీం ధర్మాసనం..

|

Feb 08, 2022 | 7:00 PM

Supreme Court of India: వరకట్న వేధింపులు, భార్య హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం షాకింగ్ కామెంట్స్ చేసింది. నిందితుడికి బెయిల్ తిరస్కరించిన..

Supreme Court of India: పెళ్లి చేసుకుని ఏటా ఒకరిని చంపాలా?.. న్యాయవాదికి షాక్ ఇచ్చిన సుప్రీం ధర్మాసనం..
Follow us on

Supreme Court of India: వరకట్న వేధింపులు, భార్య హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం షాకింగ్ కామెంట్స్ చేసింది. నిందితుడికి బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం.. న్యాయవాది చేసిన వింత వాదనకు చురకలంటిస్తూ షాకింగ్ కౌంటర్ ఇచ్చింది. వరకట్నం విషయంలో కట్టుకున్న భార్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా.. భార్యను హత మార్చిన కేసులో ఓ వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి బెయిల్ విషయమై.. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, బెయిల్ పిటిషన్ కోసం వాదించిన నిందితుడి తరఫు న్యాయవాది.. తన క్లైంట్ పూర్వం ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు ఆధారాలేవీ లేవని అన్నారు. ఈ వ్యాఖ్యకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? పూర్వ ఘటనలు అంటే ఏంటి? నిందితుడు ప్రతి సంవత్సరం ఒకరిని వివాహ చేసుకుని, భార్యను చంపాలాలనుకుంటున్నారా? ఇప్పుడు చేసిన నేరానికి, పూర్వం ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అనడానికి అర్థం ఏంటి?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసే ప్రసక్తే లేదని న్యాయస్థానం తేల్చి చెబుతూ.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

Also read:

సింహంతో సెల్ఫీ !! కట్ చేస్తే చివర్లో ఊహించని ట్విస్ట్ !! వీడియో

Reebok ActiveFit 1.0: 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రీబాక్ స్మార్ట్‌వాచ్.. వీడియో

Viral Video: రూ.500 కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! వీడియో