Ekta Kapoor: నిర్మాతకు సుప్రీంకోర్టు చివాట్లు.. అసభ్యకరమైన ‏కంటెంట్‏తో యువత మనసు పాడు చేస్తున్నారంటూ ఫైర్..

|

Oct 15, 2022 | 9:32 AM

ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం సరైన పద్దతి కాదంటూ ఆమెకు హితవు పలికింది. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Ekta Kapoor: నిర్మాతకు సుప్రీంకోర్టు చివాట్లు.. అసభ్యకరమైన ‏కంటెంట్‏తో యువత మనసు పాడు చేస్తున్నారంటూ ఫైర్..
Ekta Kapoor
Follow us on

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. అభ్యంతకరమైన కంటెంట్ తెరకెక్కిస్తూ.. దేశంలోని యువత మనసులను కలుషితం చేస్తున్నారంటూ మండిపడింది. ఆమె తెరకెక్కించిన ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్ పై కేసు నమోదు కావడం.. తనపై అరెస్ట్ వారెంట్స్ జారీ కావడంతో ఏక్తాకపూర్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం సరైన పద్దతి కాదంటూ ఆమెకు హితవు పలికింది. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఏఎల్టీ బాలాజీలో ప్రసారమైన వెబ్ సిరీస్‏లో సైనికులను అవమానించినందుకు.. వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీసినందంకు ఆమెపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై భారత అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఆమె తరుపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని.. అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఉపశమనం కల్పించిందని గుర్తుచేశారు. ఓటీటీ ప్లాట్ ఫాంపై ప్రసారమవుతున్న సబ్ స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. దేశంలో తమకు నచ్చిన కంటెంట్ ఎంచుకునే స్వేచ్చ ఉందన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వ్యాఖ్యలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‏లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ” ఏదో ఒకటి చేయాలి. మీరు ఈ దేశంలోని యువత మనసులను కలుషితం చేస్తున్నారు. ఓటీటీ అందించే కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ప్రజలకు ఎలాంటి ఛాయిస్ ఇస్తున్నారు ? దీనికి వ్యతిరేకంగా మీరు యువకుల మనసులను కలుషితం చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రతిసారి ఈ కోర్టుకు వస్తున్నారు. మేము దీనిని సమర్ధించలేము. ఇటువంటి పిటిషన్ దాఖలు చేసినందుకు మీపై జరిమానా విధిస్తాము.

ఇవి కూడా చదవండి

మిస్టర్ రోహత్గీ మంచి లాయర్ల సేవలను కొనుగోలు చేయగలిగినంత మాత్రాన.. ఈ కోర్టు గొంతు అనేది ఉన్నవారి కోసం కాదని దయచేసి మీ క్లయింట్‏కు చెప్పండి.. గొప్పలు లేనివారి కోసం ఈ కోర్టు పనిచేస్తుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఈ ప్రజలకు న్యాయం చేయలేకపోతే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీ ఆర్టర్ పరిశీలించాము. కానీ మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి అని ధర్మాసనం తెలిసింది. ప్రస్తుతం ఈ అంశాన్ని పెండింగ్‏లో ఉంచామని.. తదుపరి విచారణ తేదీని త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.