Board Exam: రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పరీక్షలను ఇప్పటి వరకు రద్దు చేయని రాష్ట్రాలు పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ ఉండగా, ఈ నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు జూన్ 17వ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సోమవారం కూడా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. రేపటికి వాయిదా వేసింది. కాగా, 12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాలు రద్దు చేశాయి. 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించగా, 4 రాష్ట్రాలు రద్దు చేయలేదు. ఈ నాలుగు రాష్ట్రాలకు గత గురువారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేరళలో 11వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయలేదు. ఆ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ జారీ చేసింది. ఇక తాజాగా చేపట్టిన విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. అయితే అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు సైతం పరీక్షలు రద్దు చేస్తామని ప్రకటించాయి. ఇక మిగిలింది ఏపీ రాష్ట్రం. రేపటి విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.
కాగా, దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్ని మూతపడ్డాయి. దీంతో విద్యార్థులకు పరీక్షలను సైతం రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయకపోవడంతో ఆ రాష్ట్రాలపై వ్యతిరేకత ఎదురైంది. కనీసం బోర్డు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుండగా, మరి కొందరు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది.