Supreme Court CJI: బరితెగించిన కేటుగాళ్లు.. ఈసారి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌కే పంగనామం! ఏం చేశారంటే

|

Aug 28, 2024 | 4:44 PM

నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్‌ చేతిలోకొచ్చాక సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. నెట్టింట ప్రముఖ వ్యక్తుల పేరిట నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసి, డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు నిత్యం పలుచోట్ల జరుగుతున్నాయి. ఈ లిస్టులో ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుని..

Supreme Court CJI: బరితెగించిన కేటుగాళ్లు.. ఈసారి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌కే పంగనామం! ఏం చేశారంటే
CJI DY Chandrachud
Follow us on

న్యూఢిల్లీ, ఆగస్టు 28: నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్‌ చేతిలోకొచ్చాక సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. నెట్టింట ప్రముఖ వ్యక్తుల పేరిట నకిలీ ఖాతాలు క్రియేట్‌ చేసి, డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు నిత్యం పలుచోట్ల జరుగుతున్నాయి. ఈ లిస్టులో ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుని సైబర్‌ నేరగాళ్లు డబ్బులు గుంజు తున్నారు. తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ పేరిట కూడా ఫేక్‌ అకౌంట్ క్రియేట్ చేసిన మాయగాళ్లు క్యాబ్ ఛార్జీల కోసం డబ్బు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ చంద్రచూడ్ సైబర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేశారు. దీంతో సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.

అసలేం జరిగిందంటే.. సీజేఐ చంద్రచూడ్‌ పేరిట ఫేక్ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన సైబర్‌ కేటుగాడు.. ఆయన ఫొటోను ప్రొఫైల్‌ ఇమేజ్‌గా పెట్టాడు. అనంతరం తనను తాను సీజేఐగా పరిచయం చేసుకొని, కొలీజియం మీటింగ్‌కు వెళ్తున్నానని, కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నానని, క్యాబ్‌ ఛార్జీల కోసం రూ.500 పంపాలని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులో కోరాడు. సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత డబ్బు తిరిగి ఇస్తానని హామీ కూడా ఇచ్చాడు. పైగా జనాలను నమ్మించడానికి తాను ఈ మెసేజ్‌ను ఐప్యాడ్‌ నుంచి పంపుతున్నానని పోస్టులో పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్టు స్క్రీన్‌ షాట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి రావటంతో ఆ సైబర్ నేరగాడిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సీజేఐ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్‌ను స్క్రీన్‌షాట్‌ చేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్క్రీన్‌షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.