సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఆయనకున్న ప్రొటోకాల్ గురించి అందరికీ తెలిసిందే. భారత అత్యున్నత న్యాయస్థానానికి అధిపతి కూడా.. ఆయన చెప్పిన తీర్పును ఎవరైనా శిరస్సా వహించాల్సిందే. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ చంద్రచూడ్.. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా.. సాదాసీదాగా ఉంటారనే విసయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన ఇద్దరు కూతుళ్లను సుప్రీంకోర్టు కు తీసుకువచ్చి అందరిని ఆశ్చర్యపర్చారు. కోర్టు ప్రారంభం కావడానికి అరగంట ముందే, ఉదయం 10 గంటలకే వారితో సుప్రీంకోర్టుకు వచ్చిన చంద్ర చూడ్ తన పిల్లలకు చాంబర్, కోర్ట్ హాల్, ఇతర న్యాయమూర్తుల చాంబర్స్ మొదలైనవి స్వయంగా చూపించారు. కోర్టులో న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటారు, న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు.. సాధారణ పౌరులు ఎక్కడ కూర్చుంటారు అనే విషయాలను స్వయంగా వారికి వివరించారు. కోర్టు పనితీరును తెలియజేశారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి తను కూర్చునే కోర్టు హాల్ కు తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ శుక్రవారం తనతో పాటు తీసుకువచ్చిన ఇద్దరు బాలికలు కూడా ఆయన పెంచుకున్న కూతుళ్లు కావడం విశేషం. అలాగే, ఆ ఇద్దరు బాలికలు కూడా దివ్యాంగులే.
ఒక్కసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాను పెంచుకున్న ఇద్దరు కుమార్తెలను న్యాయస్థానానికి తీసుకురావడంతో పాటు.. సాధారణ వ్యక్తిగా కోర్టు ఆవరణలో తిరుగుతూ.. పిల్లల్లకు న్యాయస్థానం పనితీరును వివరించి అందరినీ ఆశ్చర్యపర్చారు చంద్రచూడ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..