Superbug: దేశంలో కరోనాను మించిన కొత్త మహమ్మారి.. తల పట్టుకుంటున్న డాక్టర్స్..

|

Oct 11, 2022 | 7:53 AM

దేశంలో కొత్త టెన్షన్‌ ఇది.. యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియా వల్ల సూపర్‌బగ్స్ విజృభిస్తున్నాయి. వీటివల్ల బాధపడుతున్న పేషెంట్లుకి చికిత్స చేయడం..

Superbug: దేశంలో కరోనాను మించిన కొత్త మహమ్మారి.. తల పట్టుకుంటున్న డాక్టర్స్..
Superbug
Follow us on

దేశంలో కొత్త టెన్షన్‌ ఇది.. యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియా వల్ల సూపర్‌బగ్స్ విజృభిస్తున్నాయి. వీటివల్ల బాధపడుతున్న పేషెంట్లుకి చికిత్స చేయడం డాక్టర్లకు కష్టంగా మారింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే అల్లాడుతుంది దేశం. ఇలాంటి సమయంలో పుండు మీద కారంలా కరోనాను మించిన మహమ్మారి సూపర్‌ బగ్‌ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2019లో సుమారు 12.7 లక్షల మంది సూపర్‌బగ్స్ వల్ల చనిపోయారని మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ చెబుతోంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. సూపర్‌బగ్స్‌కు ఉండే రెసిస్టెన్స్ శక్తి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏడాది సుమారు 60వేల మంది ఇలా చనిపోతున్నారు.

అయితే ఇప్పుడు మహారాష్ట్రలోని కస్తూర్బా హాస్పిటల్‌లో సూపర్‌బగ్స్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో డాక్టర్లు తలమునకలవుతున్నారు.ఇ-కోలాయ్, సాల్మోనెల్లా వంటి 5 రకాల బ్యాక్టీరియాలు ప్రధానంగా మనుషులకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. మనుషులు, జంతువుల పేగుల్లో ‘ఇ-కోలాయ్’ బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఊపిరితిత్తులకు సోకే ‘క్లెబ్సియల్లా న్యుమోనియా’ వల్ల న్యుమోనియా సోకుతుంది. ఈ సూపర్‌బగ్స్‌ వల్ల కలిగే వ్యాధులను ట్రీట్ చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావం 15శాతం కంటే తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు తమ పరిశోధనలో గుర్తించారు.

దీని కారణంగా రోగులకు చికిత్స అందించడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలు, చిన్నచిన్న పట్టణాల నుంచి న్యుమోనియా, మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లతో వచ్చే అవుట్ పేషెంట్లలోనూ ఈ సూపర్‌బగ్స్ కనిపిస్తున్నట్లు కస్తూర్బా హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. వీరిలో చాలా మంది అంతకు ముందు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకురారు. ఏ మందులు వాడారో కూడా కొందరికి తెలియదు. అందువల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లకు ట్రీట్ చేయడం కష్టంగా మారుతోందని డాక్టర్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..