Indian railways: ఈగూడ్స్ రైలు పొడవెంతో తెలుసా.. భారతీయ రైల్వే మరో రికార్డు

భారతీయ రైల్వే మరో ఘనత సాధించింది. స్వాంతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ అతి పొడవైన గూడ్సు రైలు విజయంవంతంగా నడిపిండి. ఇప్పటి వరకు 90 వ్యాగన్ల సామర్థ్యంతో నడిచిన రైలు..

Indian railways: ఈగూడ్స్ రైలు పొడవెంతో తెలుసా.. భారతీయ రైల్వే మరో రికార్డు
Super Vasuki Goods Train

Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:44 PM

Indian Railways: భారతీయ రైల్వే మరో ఘనత సాధించింది. స్వాంతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ అతి పొడవైన గూడ్సు రైలు విజయంవంతంగా నడిపిండి. ఇప్పటి వరకు 90 వ్యాగన్ల సామర్థ్యంతో నడిచిన రైలు.. ఒక్కసారి దాని సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచుకుంది. ‘సూపర్ వాసుకి’ పేరుతో భారతీయ రైల్వే ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలో అతి పెద్ద గూడ్స్ రైలును ప్రయోగించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 295 వ్యాగన్లు గల ఈరైలు పొడవు 3.5 కిలోమీటర్లు, దీనికి 6 ఇంజిన్లను అమర్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేల ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధి ఛత్తీస్ ఘడ్ లోని భిలాయ్ నుంచి కోర్బా వరకు ఈఅతి పొడవైన రైలును నడిపించారు. ఇప్పటివరకు గరిష్టంగా 9000 టన్నుల బొగ్గును మాత్రమే ఒక గూడ్స్ రైలు ద్వారా రవాణా చేయగా.. 295 వ్యాగన్లు గల ఈ భారీ గూడ్స్ రైలు ద్వారా 27,000 టన్నుల బొగ్గును భారతీయ రైల్వే రవాణా చేసింది.

ఒక రైలులో ఇంత భారీ మొత్తంలో సరకు రవాణా చేయడం ఇదే ప్రథమం. ఈ భారీ గూడ్స్ రైలు సరఫరా చేసే బొగ్గుతో 3000 మెగావాట్ల ప్లాంట్ ను ఒక రోజు పూర్తిగా నడపవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరైలును నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. గతంలో వాసుకి, త్రిశూల్ పేర్లతో అతి పొడవైన గూడ్స్ రైళ్లను రైల్వే శాఖ నడిపినా.. వాటి పొడవు 28 కిలోమీటర్ల లోపే ఉంది. విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించడం, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ బొగ్గు సరఫరా కోసం ఈ పొడవైన రైళ్లను రైల్వే శాఖ వినియోగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..